-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Today is the first puja of Lambodar-NGTS-AndhraPradesh
-
నేడు లంబోదరుడికి తొలిపూజ
ABN , First Publish Date - 2022-08-31T05:47:36+05:30 IST
జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలకు ముస్తాబు చేశారు.

అనంతపురం కల్చరల్, ఆగస్టు30: జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలకు ముస్తాబు చేశారు. మంగళవారం నాటికి వినాయక మండపాల ఏర్పాటు పూర్తి చేసి ఆధ్యాత్మిక సంస్థలు, యువత తర్వాత కార్యక్రమాలకు సంబంధించి సన్నాహాలను వేగవంతం చేశారు. బుధవారం నుంచి విశేష పూజలతో వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించేందుకు వేదికలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. లంబోదరుడి విగ్రహాలు, పూజాసామగ్రి కొనుగోళ్లతో మార్కెట్‌లు కిక్కిరిశాయి.
కొలువుదీరిన వెండి వినాయకుడు
గుంతకల్లు, ఆగస్టు 30: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన వెండి వినాయకుడు గుంతకల్లు పట్టణంలోని కన్యకా పరమేశ్వరీ ఆలయంలో మంగళవారం సాయంత్రం కొలువుదీరాడు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని అవోపా రాష్ట్ర అధ్యక్షుడు, విగ్రహదాత పువ్వాడి చంద్రశేఖర్ స్వగృహం నుంచి వెండి వినాయకుడిని ఊరేగింపుగా తెచ్చి కొలువుదీర్చారు.