వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

ABN , First Publish Date - 2022-09-28T05:26:53+05:30 IST

ఉమ్మడి జిల్లాల్లో మంగళవారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదం ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. గార్లదిన్నెలో ఒకరు, మడకశిర, రాప్తాడులో మరొకరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
అక్తర్‌ మృతదేహం

గార్లదిన్నె, సెప్టెంబరు 27: ఉమ్మడి జిల్లాల్లో మంగళవారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదం ముగ్గురు  దుర్మరణం పాలయ్యారు. గార్లదిన్నెలో ఒకరు, మడకశిర, రాప్తాడులో మరొకరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గార్లదిన్నె మండలంలోని కల్లూరులో 44వ జాతీయ రహాదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్తర్‌ (28) అనే జీపు డ్రైవర్‌ మృతి చెందాడు. పామిడి పట్టణానికి చెందిన అస్లం కుమారుడు అక్తర్‌ జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంలో కల్లూరుకు వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం ఆదుపుతప్పింది. ఈ ప్రమాదంలో అక్తర్‌ కిందకు పడిపోవడంతో తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 


Read more