-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Three and a half years no progress-MRGS-AndhraPradesh
-
మూడున్నరేళ్లు అవుతున్నా అభివృద్ధి ఏదీ?
ABN , First Publish Date - 2022-10-02T05:13:43+05:30 IST
వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సర కాలం అవుతోంది... ఎక్కడైనా నీటి కొళాయికానీ, రోడ్డుకానీ ఏర్పాటు చేశారా అని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిని టీడీపీ నాయకులు, ప్రజలు ప్రశ్నించారు.

ఎమ్మెల్యేని ప్రశ్నించిన టీడీపీ నాయకులు, ప్రజలు
్లఓబుళదేవరచెరువు, అక్టోబరు 1: వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సర కాలం అవుతోంది... ఎక్కడైనా నీటి కొళాయికానీ, రోడ్డుకానీ ఏర్పాటు చేశారా అని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిని టీడీపీ నాయకులు, ప్రజలు ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యేని శనివారం మహమ్మదాబాద్ క్రాస్‌లో టీడీపీ నాయకులు బోనాల రామాంజి, ఉప సర్పంచ ఉత్తప్ప, ప్రజలు పైవిధంగా ప్రశ్నించారు. అందుకే గడప గడపకు ఏర్పాటు చేశామని, తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
వెళ్లేటప్పుడు ఆటోల్లో.. వచ్చేటప్పుడు కాలినడక..
వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి వివిధ గ్రామాల మహిళలను ఆటో ల్లో తరలించారు. అయితే సమావే శం అయిన తరు వాత చాలా మం దికి ఆటో సౌకర్యం లేకపోవడంతో దా దాపు ఒకటిన్నర కిలోమీటరు కాలినడకన మండలకేంద్రానికి వచ్చి, స్వగ్రామాలకు తిరుగు ప్రయాణం చేయాల్సి వచ్చింది.