9న ఈ క్రాపింగ్‌ తుది జాబితా

ABN , First Publish Date - 2022-11-03T00:24:32+05:30 IST

ఈ ఏడాది ఖరీ్‌ఫకు సంబంధించి ఈ క్రాపింగ్‌ తుది జాబితాను ఈనెల 9వతేదీన విడుదల చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1254971 ఎకరాల్లో సాగు చేసిన వివిధ రకాల పంటలను ఈ క్రాపింగ్‌ చేయడంతోపాటు రైతులతో ఈకేవైసీ వేయించినట్లు వివరించారు.

9న ఈ క్రాపింగ్‌ తుది జాబితా

జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్‌

అనంతపురం అర్బన, నవంబరు 2: ఈ ఏడాది ఖరీ్‌ఫకు సంబంధించి ఈ క్రాపింగ్‌ తుది జాబితాను ఈనెల 9వతేదీన విడుదల చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1254971 ఎకరాల్లో సాగు చేసిన వివిధ రకాల పంటలను ఈ క్రాపింగ్‌ చేయడంతోపాటు రైతులతో ఈకేవైసీ వేయించినట్లు వివరించారు. సామాజిక తనిఖీల్లో భాగంగా అక్టోబరు 28 నుంచి ఈనెల 1వతేదీ దాకా ఆర్బీకేల్లో ఈ క్రాపింగ్‌ ముసాయిదా జాబితాను ప్రదర్శించినట్లు వెల్లడించారు. ఈనెల 4వతేదీ దాకా ఆర్బీకేల్లో రైతులతో గ్రామ సభలు నిర్వహించి, రైతుల వివరాలతోపాటు సామాజిక తనిఖీల్లో వచ్చిన అర్జీలు, వాటిపై తీసుకున్న చర్యలను చదివి వినిపి స్తారన్నారు. సామాజిక తనిఖీల్లో వచ్చిన అర్జీలను ఈనెల 4వతేదీలోగా ఆనలైనలో నమోదు చేస్తారన్నారు. ఈనెల 6వతేదీలోపు మండల వ్యవ సాయాధికారి, తహసీల్దార్లు ఆ వివరాలను ఆమోదిస్తారన్నారు. అనంతరం ఈనెల 9వతేదీన ఈ క్రాపింగ్‌ తుది జాబితాను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-03T00:24:35+05:30 IST