ఈ క్రాపింగ్‌ తుది జాబితా విడుదల

ABN , First Publish Date - 2022-11-24T00:28:55+05:30 IST

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజనలో ఈ క్రాపింగ్‌ తుది జాబితాను ఎట్టకేలకు ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్బీకేల్లో సామాజిక తనిఖీ తర్వాత ఈ క్రాపింగ్‌ యాప్‌లో సాంకేతిక సమస్యలతో గత కొన్ని రోజులుగా తుది జాబితా తయారీలో జాప్యం జరిగింది. ఈక్రమంలో వారం రోజుల క్రితం తుది జాబితాను తయారు చేసి రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపారు.

ఈ క్రాపింగ్‌ తుది జాబితా విడుదల

రేపటి నుంచి ధ్రువీకరణ పత్రాల జారీ

అనంతపురం అర్బన, నవంబరు 23: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజనలో ఈ క్రాపింగ్‌ తుది జాబితాను ఎట్టకేలకు ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్బీకేల్లో సామాజిక తనిఖీ తర్వాత ఈ క్రాపింగ్‌ యాప్‌లో సాంకేతిక సమస్యలతో గత కొన్ని రోజులుగా తుది జాబితా తయారీలో జాప్యం జరిగింది. ఈక్రమంలో వారం రోజుల క్రితం తుది జాబితాను తయారు చేసి రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపారు. జిల్లా వ్యాప్తంగా 1254651 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు ఈ క్రాపింగ్‌, ఈకేవైసీ పూర్తి చేశారు. ఆ మేరకు తుది జాబితాను ఆర్బీకేల వారిగా జిల్లాకు పంపారు. గత రెండు రోజుల నుంచి రైతుల సెల్‌ఫోన్లకు ఈ క్రాపింగ్‌ పూర్తయినట్లు ఎస్‌ఎంఎ్‌సలు పంపుతున్నారు. శుక్రవారం నుంచి ఆర్బీకేల్లో ప్రభుత్వం తరఫున ఈ క్రాపింగ్‌ నమోదు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని నిర్ణయించారు. రైతులు తమ సెల్‌ఫోన్లకు వచ్చిన ఎస్‌ఎంఎ్‌సతోపాటు ఆధార్‌ కార్డు తీసుకొని వెళితే ధ్రువీకరణ పత్రం అందజేస్తారని జిల్లా వ్యవసాయ శాఖ అఽధికారి చంద్రానాయక్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-11-24T00:28:58+05:30 IST