నన్ను చంపాలని చూస్తున్నారు

ABN , First Publish Date - 2022-09-10T05:57:16+05:30 IST

మీడియాతో డిస్మిస్డ్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకా్‌షకు అనుకూలంగా మాట్లాడినందుకు ఎస్పీ ఫక్కీరప్ప తనపై కక్ష కట్టారని లక్ష్మి ఆరోపించింది.

నన్ను చంపాలని చూస్తున్నారు

టూటౌన పీఎస్‌లో లక్ష్మి ఫిర్యాదు

అనంతపురం క్రైం, సెప్టెంబరు 9: మీడియాతో డిస్మిస్డ్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకా్‌షకు అనుకూలంగా మాట్లాడినందుకు ఎస్పీ ఫక్కీరప్ప తనపై కక్ష కట్టారని లక్ష్మి ఆరోపించింది.  తనను చంపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. టూటౌన ఎస్‌ఐ రాంప్రసాద్‌, తన భర్త వేణుగోపాల్‌రెడ్డి, అతని సోదరుడు నాగేంద్రరెడ్డిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఆమె టూటౌనలో ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గార్లదిన్నె కేసు విషయంలో ప్రకా్‌షకు బంగారు ఆభరణాలు, రూ.10 లక్షలు డబ్బు ఇవ్వలేదని, ప్రకాష్‌ తనకు హాని కలిగించలేదని మీడియాతో చెప్పినందుకే ఎస్పీ కక్ష కట్టారని ఆరోపించింది. వారం క్రితం హౌసింగ్‌ బోర్డులోని తన ఇంట్లోకి తన భర్త వేణుగోపాల్‌రెడ్డి, అతని సోదరుడు నాగేంద్రరెడ్డి, బంధువు అంజనరెడ్డి అక్రమంగా చొరబడ్డారని తెలిపింది. వారు తనను చంపాలని ప్రయత్నించారని ఆరోపించింది. ఎస్‌ఐ రాంప్రసాద్‌ వారికి సహకరించారని ఆరోపించింది. తన ఇంటి చుట్టూ గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నారని, తనకేమైనా జరిగితే తాను ఫిర్యాదులో పేర్కొన్న వారందరూ బాధ్యులవుతారని తెలిపింది.

Read more