ఇవీ సర్కారు బడులు..

ABN , First Publish Date - 2022-07-05T05:30:00+05:30 IST

వేసవి సెలవుల అనంతరం ప్ర భుత్వ పాఠశాలలు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. మండ లంలోని పలు పాఠశాలల్లో తొలిరోజే విద్యార్థులకు అసౌకర్యాలు ఎ దురయ్యాయి.

ఇవీ సర్కారు బడులు..
అర్‌ అనంతపురంలో గదుల కొరతతో చెట్ల కిందే విద్యార్థుల చదువులు

మడకశిర రూరల్‌, జూలై 5: వేసవి సెలవుల అనంతరం ప్ర భుత్వ పాఠశాలలు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. మండ లంలోని పలు పాఠశాలల్లో తొలిరోజే విద్యార్థులకు అసౌకర్యాలు ఎ దురయ్యాయి. చాలీచాలని గదుల కొరతతో ఆరుబయటే నేలపై కూ ర్చోవాల్సి వచ్చింది. పాఠశాల ఆవరణమంతా పిచ్చిమొక్కలతో దర్శనమిచ్చాయి. శిథిలమైన తరగతి గదుల్లో బిక్కుబిక్కుమంటూ చదువు లు కొనసాగించాల్సి వస్తోంది. మండలవ్యాప్తంగా 17 ఉన్నత పాఠశా లలు, 12 ప్రాథమికోన్నత, 82 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వం నాడు-నేడు కింద పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీ ర్చిదిద్దినట్లు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అన్నీ అసౌకర్యాలే. మణూ రు ఉన్నత పాఠశాల గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉంది. పా ఠశాల ఆవరణలో చేతి పంపు బోరు ఉన్నా, తాగునీరు లేక విద్యార్థు లు ఇళ్ల నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. మైదానంలో పిచ్చిమొక్కలు, కంప చెట్లు ఏపుగా పెరిగి, విషపురుగులకు ఆవాసంగా మారింది.  నాడు-నేడులో భాగంగా చేపట్టిన పనులు అర్ధంతరంగా ఆగిపోయా యి. కాపౌండ్‌వాల్‌ నిర్మాణం ముందుకుసాగలేదు.


ఆర్‌ అనంతపు రం ఉన్నత పాఠశాలలో గదుల కొరతతో విద్యార్థులు చెట్లకింద చ దువు సాగిస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు లేవు. వైబీహళ్ళి పాఠశాలకు కాంపౌండ్‌వాల్‌ లేక పాఠశాల ఆవరణలోకి పశువులు వస్తున్నాయి. కేతేపల్లి పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. టీడీపల్లి పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. బుళ్ళసముద్రం పాఠశాలలో వే సిన ఫ్యాన్లు వంగిపోయాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతిని ధులు స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాల ని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


Read more