బస్సు లేదు మరి..!

ABN , First Publish Date - 2022-11-19T00:21:49+05:30 IST

బొమ్మనహాళ్‌ మండల పరిధిలోని బొల్లనగుడ్డం, కళ్లుహోళ విద్యార్థులు వీరు. ఈ రెండు గ్రామాల నుంచి సుమారు ఐదు కి.మీ. దూరంలోని గోవిందవాడ జిల్లా పరిషత హైస్కూలుకు సుమారు వంద మంది విద్యార్థులు వస్తారు. రోడ్డు శిథిలావస్థకు చేరడంతో ఆర్టీసీ బస్సు సర్వీసును రెండునెలల క్రితం నిలిపేశారు.

బస్సు లేదు మరి..!
సరుకు రవాణా వాహనంలో ఒకరిపై ఒకరు ఎక్కుతున్న విద్యార్థులు

బొమ్మనహాళ్‌ మండల పరిధిలోని బొల్లనగుడ్డం, కళ్లుహోళ విద్యార్థులు వీరు. ఈ రెండు గ్రామాల నుంచి సుమారు ఐదు కి.మీ. దూరంలోని గోవిందవాడ జిల్లా పరిషత హైస్కూలుకు సుమారు వంద మంది విద్యార్థులు వస్తారు. రోడ్డు శిథిలావస్థకు చేరడంతో ఆర్టీసీ బస్సు సర్వీసును రెండునెలల క్రితం నిలిపేశారు. అప్పటి నుంచి విద్యార్థులు ఇలా ఆటోలు, సరుకు రవాణా వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కూర్చునేందుకు కాదుగదా.. నిలబడేందుకూ చోటు ఉండటం లేదు. ఇలా వేలాడుతూ.. ప్రాణాపాయ స్థితిలో ప్రయాణం చేస్తున్నారు. ఏదో ఓ ఘోరం జరిగితే తప్ప.. అధికారుల కళ్లకు ఇలాంటివి కనిపించవని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- బొమ్మనహాళ్‌

Updated Date - 2022-11-19T00:21:49+05:30 IST

Read more