మూడేళ్లుగా శుద్ధజల కేంద్రం మూత

ABN , First Publish Date - 2022-10-01T06:29:37+05:30 IST

మండలంలోని చిన్నకోడిపల్లి, పెద్దగువ్వలపల్లి గ్రామాల్లో మూడేళ్లుగా శుద్ధజల కేంద్రాలు మూతబడ్డాయి. ఆయా గ్రామాల ప్రజల కోసం గత ప్రభుత్వంలో శుద్ధ జల కేంద్రా లు ఏర్పాటు చేశారు.

మూడేళ్లుగా శుద్ధజల కేంద్రం మూత
మూతపడిన చిన్నకోడిపల్లి శుద్ధజల కేంద్రం

రొద్దం, సెప్టెంబరు 30: మండలంలోని చిన్నకోడిపల్లి, పెద్దగువ్వలపల్లి గ్రామాల్లో మూడేళ్లుగా శుద్ధజల కేంద్రాలు మూతబడ్డాయి. ఆయా గ్రామాల ప్రజల కోసం గత ప్రభుత్వంలో శుద్ధ జల కేంద్రా లు ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగా నే వాటిని పట్టించుకోవడం మానేశారు. ఉద్దేశపూర్వకంగానే శుద్ధ జ ల కేంద్రాలను మూతబడేలా చేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. చిన్నకోడిపల్లి గ్రామస్థులు వర్షాల కారణంగా ఎక్కడా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. శుద్ధజలం కావాలంటే రొద్దం నుంచి తెచ్చుకునేవా రు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  50 రోజులుగా పెన్నానదిలో నీరు ప్రవహస్తుండటంతో రోడ్డ మార్గం లేక గ్రామస్థుల బాధలు వర్ణణాతీతం. పెద్దగువ్వలపల్లిలో శుద్ధజలం కోసం పక్క గ్రామాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఇ ప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శుద్ధజల కేంద్రాలను పునఃప్రారంభించాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Read more