-
-
Home » Andhra Pradesh » Ananthapuram » The uncompromising struggle for the preservation of education TNSF-NGTS-AndhraPradesh
-
విద్యారంగ పరిరక్షణకు రాజీలేని పోరాటం: టీఎనఎ్‌సఎ్‌ఫ
ABN , First Publish Date - 2022-03-16T06:03:27+05:30 IST
వైసీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీ ర్యమైందని, పరిరక్షణ కోసం రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని తెలుగునా డు విద్యార్థి సంఘం (టీఎనఎస్‌ఎఫ్) నాయకులు పిలుపునిచ్చారు.

హిందూపురం టౌన, మార్చి 15: వైసీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీ ర్యమైందని, పరిరక్షణ కోసం రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని తెలుగునా డు విద్యార్థి సంఘం (టీఎనఎస్‌ఎఫ్) నాయకులు పిలుపునిచ్చారు. మంగళవా రం స్థానిక ఎమ్మెల్యే నివాసం వద్ద టీఎనఎ్‌సఎ్‌ఫ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు అభిషేక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు మాట్లాడారు. ఎయిడెడ్ విద్యాసంస్థలు ప్రైవేటీకరణ, గత ప్రభుత్వ విద్యా పథకాలను నిర్వీర్యం చేసే కుట్ర సా గుతోందన్నారు. విలీన ప్రక్రియతో పేదలకు ప్రాథమిక విద్యను దూరం చేస్తోందన్నారు. టీఎనఎ్‌సఎఫ్ నాయకులు మాట్లాడుతూ విద్యారంగంలో ప్రభుత్వ వైఫ ల్యాలను విద్యార్థుల్లోకి తీసుకుపోయి ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు నరేంద్ర, అభిషేక్, అమాన, శ్రీనాథ్, జితేంద్ర, సునీల్, ప్రకాశ, యుగంధర్, విశ్వనాథ్‌రెడ్డి, ప్రకాశ, రాజే్‌షనాయుడు పాల్గొన్నారు.