ఏలికలు పట్టించుకోలేదని.. ఏకమై..!

ABN , First Publish Date - 2022-11-25T00:18:30+05:30 IST

కంబదూరు మండలం జెల్లిపల్లి వద్ద కల్వర్టు ఇటీవల కురిసిన వర్షాలకు పాడైపోయింది. బాగు చేయాలని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో గ్రామస్థులు చందా వేసుకుని బాగు చేసుకుంటున్నారు.

ఏలికలు పట్టించుకోలేదని.. ఏకమై..!

కంబదూరు మండలం జెల్లిపల్లి వద్ద కల్వర్టు ఇటీవల కురిసిన వర్షాలకు పాడైపోయింది. బాగు చేయాలని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో గ్రామస్థులు చందా వేసుకుని బాగు చేసుకుంటున్నారు. ఒక్కో కుటుంబం రూ.1000 నుంచి రూ.2000 చందా ఇచ్చింది. ఇలా సుమారు రూ.40 వేలు సేకరించారు. ఎక్స్‌కవేటర్‌ను అద్దెకు తెప్పించారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమదానం చేశారు. శుక్రవారం కూడా పనులు కొనసాగించి, పూర్తి చేయాలని నిర్ణయించారు. వివిధ గ్రామాలకు అనుసంధానంగా ఉండే ఈ కల్వర్టును బాగు చేస్తే తమకు ఇబ్బందులు తొలగుతాయని గ్రామస్థులు తెలిపారు.

- కంబదూరు (కళ్యాణదుర్గం)

Updated Date - 2022-11-25T00:18:30+05:30 IST

Read more