శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం : డీఐజీ

ABN , First Publish Date - 2022-09-09T05:07:45+05:30 IST

శాంతిభద్రతలు, ప్రజల రక్షణ కోసం పనిచేయడమే పోలీసుల ధ్యేయమని డీఐజీ రవిప్రకాష్‌ పేర్కొన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం : డీఐజీ
శిలాఫలాకాన్ని ఆవిష్కరించిన డీఐజీ, ఎస్పీ, ఎమ్మెల్యే

ధర్మవరం రూరల్‌, సెప్టెంబరు 8: శాంతిభద్రతలు, ప్రజల రక్షణ కోసం పనిచేయడమే పోలీసుల ధ్యేయమని డీఐజీ రవిప్రకాష్‌ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని పోతుకుంట రహదారిలో ఉన్న పాత రూరల్‌పోలీ్‌సస్టేషనలో 2వ పట్టణ పోలీ్‌సస్టేషనను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఐజీ రవిప్రకాష్‌, ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌, ఎంపీ గోరంట్లమాధవ్‌, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిలు హాజరయ్యారు. అనంతరం డీఐజీ రవిప్రకాష్‌ మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం జనాభాప్రతిపాదికన పట్టణంలో రెండవ పోలీ్‌సస్టేషనను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలకు పారదర్శకంగా పనిచేసేందుకు పోలీ్‌సశాఖ శాయశాక్తులా పనిచేస్తామన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ సీఐ రాజా, వనటౌన సీఐ సుబ్రమణ్యం, మున్సిపల్‌ చైర్‌పర్సన, లింగం నిర్మల, ఎస్‌ఐలు, సిబ్బంది, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.


Read more