మైనార్టీల పాదయాత్రను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-09-30T06:14:30+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలకు జరిగిన అన్యాయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీ సుకెళతామని, యాత్రను విజయవంతం చేయాలని టీడీపీ మైనార్టీసెల్‌ జిల్లా అధ్యక్షులు భక్తర్‌వలి అన్నారు.

మైనార్టీల పాదయాత్రను విజయవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న భక్తర్‌వలి

హిందూపురం, సెప్టెంబరు 29: వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలకు జరిగిన అన్యాయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీ సుకెళతామని, యాత్రను విజయవంతం చేయాలని టీడీపీ మైనార్టీసెల్‌ జిల్లా అధ్యక్షులు భక్తర్‌వలి అన్నారు. గురువారం స్థానికంగా ఎ మ్మెల్యే నివాసంలో జరిగిన టీడీపీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర మైనార్టీసెల్‌ అధ్యక్షులు ము స్తాక్‌అహ్మద్‌ ఈనెల 18 నుంచి రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అక్టోబరు 2, 3న శ్రీసత్యసాయి జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. వచ్చేనెల 3న హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తారన్నారు. యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం, భవిష్యత్తు అభ్యున్నతిపై యాత్రలో చర్చిస్తామ న్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఆర్‌ఎంఎస్‌ షఫీ, అంజిన ప్ప, అంబికా లక్ష్మీనారాయణ, అనిల్‌, నాగరాజు, హిదాయతుల్లా, ర మేష్‌, డైమండ్‌బాబా, నజీర్‌, అజ్మతుల్లా, బాబాఫకృద్దీన, దాదాఖాన తదితరులు పాల్గొన్నారు. 


Read more