-
-
Home » Andhra Pradesh » Ananthapuram » The driver of the petrol tanker overturned and died-MRGS-AndhraPradesh
-
పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
ABN , First Publish Date - 2022-09-28T05:27:35+05:30 IST
మండలలోని కోతులగుట్ట గ్రామ సమీపంలో పెట్రోల్‌ను తరలిస్తున్న ఓ ట్యాంకర్ అదుపుతప్పి కిందకు పడిన ఘటనలో భాస్కర్ (38) అక్కడికక్కడే మృతిచెందాడు.

మడకశిర రూరల్: మండలలోని కోతులగుట్ట గ్రామ సమీపంలో పెట్రోల్‌ను తరలిస్తున్న ఓ ట్యాంకర్ అదుపుతప్పి కిందకు పడిన ఘటనలో భాస్కర్ (38) అక్కడికక్కడే మృతిచెందాడు. ఇదే ఘటనలో దయానంద్ అనే యువకుడికి గాయాలు కావడంతో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి పెట్రోల్‌తో వెళ్ళిన ట్యాంకర్ తిరుమణికి ఖాళీచేసి తిరిగి వస్తుండగా మండల పరిధిలోని కోతులగుట్టగ్రామ సమీపంలో మలుపు వద్ద అదుపుతప్పి ట్యాంకర్ బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పావగడ తాలూకా కోటకోత్తురు గ్రామానికి చెందినట్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ నాగేంద్ర తెలిపారు.