మద్యపాన నిషేధంపై మాట తప్పిన సీఎం

ABN , First Publish Date - 2022-08-02T05:26:27+05:30 IST

దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న హామీని వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందంటూ టీడీపీ నాయకులు, తెలుగుమహిళ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ధర్నా చేపట్టారు.

మద్యపాన నిషేధంపై మాట తప్పిన సీఎం
రోడ్డుపై ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు, తెలుగుమహిళలు


ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాణ్యతలేని జే బ్రాండ్‌ 

రేషనదుకాణాల్లో అవినీతికంపు

ఈ అవినీతిపై టీడీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తాం

ధర్నాలో టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు

ధర్మవరం, ఆగస్టు 1:  దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న హామీని వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందంటూ టీడీపీ నాయకులు, తెలుగుమహిళ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ధర్నా చేపట్టారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి ర్యాలీగా వెళ్లి గాంధీనగర్‌ సర్కిల్‌లో ఉన్న మద్యం దుకాణం ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా తెలుగుమహిళా పార్లమెంట్‌ అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ మాట్లాడుతూ... రాష్ట్రంలో తాగడానికి మంచినీళ్లులేవుకానీ  మద్యం మా త్రం సీఎం జగన్మోహనరెడ్డి ఏరులైపారిస్తున్నారని విమర్శించారు. నకిలీ మద్యంతోపాటు తన సొంతమద్యం జే బ్రాండ్‌తో ప్రజల నెత్తురు జలగలా తాగుతున్నారన్నారు. దీంతో  ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను తాకట్టుపెట్టి మద్యంపై రూ.58వేల కోట్లు అప్పు చేసిన ఘనత సీఎం జగనకే దక్కుతుందన్నారు. అనంతరం  ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్‌ నీలకంఠారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ రేషనదుకాణాల్లో అవినీతిని అరికట్టి , రేషన కార్డుదారులందరికీ ఉచితబియ్యం ఇవ్వాలని తహసీల్దార్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతంకాటమయ్య, నాయకులు బోయరవి, పురుషోత్తంగౌడ్‌, చింతపులుసు పెద్దన్న, మేకల రామాంజ నేయులు, పరిశే సుధాకర్‌, భీమనేని ప్రసాద్‌నాయుడు, అంబటి సనత, నాగూర్‌హుస్సేన, బీబీ, చిన్నూరు విజయ్‌చౌదరి, వరదరాజులు, పఠానబాబూఖాన, గోసలశ్రీరాములు, సాకే కుళ్లాయప్ప, మిడతల యుగంధర్‌, గొట్లూరు అనిల్‌గౌడ్‌, తోటవాసుదేవ, అంకన్న, మగ్గం రామాంజి, టైలర్‌ గోపాల్‌, మారుతీ స్వామి, చంద్రశేఖర్‌, అంజి, చండ్రాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-02T05:26:27+05:30 IST