శరన్నవరాత్రుల శోభ

ABN , First Publish Date - 2022-10-05T04:02:41+05:30 IST

దసర శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. జిల్లావ్యాప్తంగా ఆలయాలు భక్తజన కోలాహలంతో కి టకిటలాడుతున్నాయి.

శరన్నవరాత్రుల శోభ
హిందూపురంలో కొల్హాపురి లక్ష్మీదేవికి గజలక్ష్మీ అలంకరణ

హిందూపురం అర్బన, అక్టోబరు 4: దసర శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. జిల్లావ్యాప్తంగా ఆలయాలు భక్తజన కోలాహలంతో కి టకిటలాడుతున్నాయి. మంగళవారం తొమ్మిదో రోజు అమ్మవార్లు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. హిందూపురంలోని కొల్హాపురి అమ్మవారు గజల క్ష్మిగా, నింకంపల్లిరోడ్డు యల్లమ్మ దేవత వెన్నతో శైలపుత్రిగా, కన్యకాపరమేశ్వరీ అమ్మవారు మంగళగౌరి దేవిగా, సూరప్ప కట్ట బోయకొండ గంగమ్మ ఆలయంలో వారాహిదేవిగా, మెయిన రోడ్డులోని జలదుర్గమ్మ, సూరప్ప కట్ట మధుగిరి మారియమ్మ ఆలయాల్లో మహిషాసుర మర్దినిగా అమ్మవా ర్లు భక్తులకు దర్శనమిచ్చారు.


లేపాక్షి: స్థానిక దుర్గా వీరభద్రస్వామి ఆలయంలో అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజ లు కొనసాగాయి. దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా దుర్గాదేవి బు ధవారం మహిషాసుర మర్దిని అలంకరణలో దర్శనమివ్వనున్నారు.


గోరంట్ల: పట్టణంలోని వాసవీమాత, చౌడేశ్వరీదేవి, గుమ్మయ్యగారిపల్లి మారెమ్మ అమ్మవార్లు మహిషాసురమర్దినిగా, గోరంట్ల మల్లాలమ్మ శాకాంబరిగా అలంకరించారు. ఆలయాల్లో అన్నదానం చేపట్టారు. 


పెనుకొండ:  స్థానిక లక్ష్మీ వెంకటరమణస్వామి ఆలయంలో స్వామివారు శ్రీకృష్ణుని రూపంలో, వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో రాజరాజేశ్వరీదేవిగా, కాళీమాత ఆలయంలో అమ్మవార్లను విశేష అలంకరణల్లో భక్తులు దర్శించుకున్నారు.


మడకశిర టౌన: పట్టణంలోని గాంధీబజార్‌ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు, భజనలు చేశారు. మిట్టబండ ఆంజనేయస్వామిని వివిధ రకాల కూరగాయలతో, పావగడ రోడ్డులో వెలసిన కొల్లాపురమ్మ, మూలకంఠేశ్వరి, గంగపూజమ్మ ఆలయాల్లో విశేష అలంకరణ, పూజలు నిర్వహించారు. 


మడకశిర రూరల్‌: మండలంలోని నీలకంఠాపురంలో పార్వతి దేవి డ్రైఫ్రూట్స్‌ అలంకరణలో, జమ్మానిపల్లిలో మహిషాసురమర్దినిగా, నిడిమామిడమ్మ, కల్లుమర్రి వీరకేతమ్మదేవి, మెళవాయి చౌడేశ్వరీదేవి, ఆమిదాలగొంది కనుమ మారెమ్మ ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణతో వివిధ రూపాలో భక్తులకు దర్శనమిచ్చారు.


రొద్దం: స్థానిక రుద్రపాదాశ్రమం ఆంజనేయస్వామి, వెంకటేశ్వరస్వా మి, రేణుకా యల్లమ్మ, ఆర్‌ మరువపల్లిలోని షిర్డీసాయి, కోన మల్లేశ్వరస్వామి ఆలయాల్లో విశేష అలంకరణలు చేశారు. 


సోమందేపల్లి: స్థానిక పాతఊరు చౌడేశ్వరీ అమ్మవారిని కరెన్సీ నోట్లతో లక్ష్మీదేవిగా, వాసవీ కన్యకాపరమేశ్వరీదేవిని అంబా భవానీగా ముస్తాబు చేశారు. పెద్దమ్మ ఆలయం ఉదయం నుంచి భక్తులతో కిక్కిరిసింది.  


రొళ్ల: మండలంలోని రత్నగిరిలో వెలిసిన కొల్లాపురమ్మ అమ్మవారికి మంగళవారం నిమ్మకాయలు, పూలతో ప్రత్యేక అలంకరణ చేసి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.


Updated Date - 2022-10-05T04:02:41+05:30 IST