వైభవం.. వెంకటేశ్వరుడి తెప్పోత్సవం

ABN , First Publish Date - 2022-05-24T05:42:37+05:30 IST

పట్టణంలోని శ్రీఘనగిరి వెంకటేశ్వరస్వామి తెప్పోత్సవం సోమవారం వైభవంగా సాగింది.

వైభవం.. వెంకటేశ్వరుడి తెప్పోత్సవం

పెనుకొండ రూరల్‌, మే 23: పట్టణంలోని శ్రీఘనగిరి వెంకటేశ్వరస్వామి తెప్పోత్సవం సోమవారం వైభవంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు ఉదయం నుంచి స్వామివారికి నిత్యారాధన, మహామంగళహారతి, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై ఆశీనులు గావించి, పురవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం బోగసముద్రం చెరువులో స్వామివారి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు హాజరై, స్వామివారి తెప్పోత్సవం నిర్వహించారు.


Read more