బీసీల ద్రోహి జగన

ABN , First Publish Date - 2022-10-01T05:57:03+05:30 IST

సీఎం జగన బీసీల ద్రోహి అని టీడీపీ బీసీ సెల్‌ నాయకులు మండిపడ్డారు.

బీసీల ద్రోహి జగన
టీడీపీ బీసీ సెల్‌ ఆధ్వర్యంలోఅంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

టీడీపీ బీసీ సెల్‌ నాయకుల మండిపాటు  

అంబేడ్కర్‌  విగ్రహం ఎదుట నిరసన 
అనంతపురం అర్బన, సెప్టెంబరు 30: సీఎం జగన బీసీల ద్రోహి అని టీడీపీ బీసీ సెల్‌ నాయకులు మండిపడ్డారు. గుంటూరులో బీసీల ఆశాజ్యోతి బీపీ మండల్‌ విగ్రహం కోసం ఏర్పాటు చేసిన శంకుస్థాపన ఫౌండేషనను కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం అంబేడ్కర్‌  విగ్రహం ఎదుట టీడీపీ బీసీ సెల్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వైసీపీ నేతలు బీసీలపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడడం దారుణమని టీడీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని అప్పటి ఎంపీ బీపీ మండల్‌ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకించడం, ఫౌండేషనను ధ్వంసం చేయడం హేయమని అన్నారు. మహనీయుల విగ్రహాలను కూలుస్తూ, వైసీపీ నాయకులు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని అన్నారు. ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ  బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దాసరి శ్రీధర్‌, చంద్రశేఖర్‌ యాదవ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి దళవాయి వెంకటనారాయణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మేదర చంద్రశేఖర్‌,  టీడీపీ  రాష్ట్ర  కార్యదర్శి దేవళ్ల మురళి, గాండ్ల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ విశాలాక్షి, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్న, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డిష్‌ నాగరాజు, జిల్లా అధికార ప్రతినిధులు సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్‌, బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుల లక్ష్మీనరసింహులు, టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌ గౌడ్‌, నాయకులు స్వామిదాస్‌, సైఫుద్దీన, గోపాల్‌గౌడ్‌, బండి పరశురాముడు, బొమ్మినేని శివ, రామకృష్ణ, మనోహర్‌, గంగవరం బుజ్జి, విజయశ్రీ, శోభ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-01T05:57:03+05:30 IST