తమిళనాడు సీఎంను చూసి నేర్చుకోవాలి

ABN , First Publish Date - 2022-10-04T05:14:55+05:30 IST

తమిళనాడులో అప్పటి సీఎం జయలలిత ప్రవేశపెట్టిన అమ్మక్యాంటిన పథకం మంచిదని, అలాగే కొన సాగిస్తున్న ప్రస్తుత సీఎం స్టాలినను చూసి ఆంధ్రప్రదేశ ముఖ్యమం త్రి జగన నేర్చుకోవాలని టీడీపీ నాయకులు ఎద్దేవాచేశారు.

తమిళనాడు సీఎంను చూసి నేర్చుకోవాలి
అన్నక్యాంటిన ద్వారా అన్నదానం చేస్తున్న టీడీపీ నాయకులు

సీఎం జగనకు టీడీపీ నాయకుల హితవు

ధర్మవరం, అక్టోబరు 3: తమిళనాడులో అప్పటి సీఎం జయలలిత ప్రవేశపెట్టిన అమ్మక్యాంటిన పథకం మంచిదని, అలాగే కొన సాగిస్తున్న ప్రస్తుత సీఎం స్టాలినను చూసి ఆంధ్రప్రదేశ ముఖ్యమం త్రి జగన  నేర్చుకోవాలని టీడీపీ నాయకులు ఎద్దేవాచేశారు. పట్టణం లోని ప్రభుత్వాస్పత్రి వద్ద సోమవారం అన్నక్యాంటిన ద్వారా పేదలకు టీడీపీ నాయకులు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పేదలు కడుపునిండా అన్నం తినాలన్న ఆలోచనతో తమ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నక్యాంటిన అనే బృహ త్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హయాంలో లక్షలాది మందిపేదలు కడుపునిండా భోజనం చేశారన్నారు. అయితే వైసీపీ అఽధికారంలోకి వచ్చాక అన్నక్యాంటినను తొలగించి పేదల కడుపు కొట్టారన్నారు. పేదల కడుపు కొట్టే ఎవరైన సరే పాతాళానికి వెళ్తారన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా దాతల సహకారంతో ప్రతిసోమవారం అన్యక్యాంటిన ద్వారా పేదలకు ఉచితంగా భోజనం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ జడ్పీటీసీ మేకల రామాంజనేయులు, చింతపులుసు పెద్దన్న, పురుషోత్తంగౌడ్‌, పరిశేసుధాకర్‌, నాగూర్‌హుస్సేన, రాళ్లపల్లిషరీప్‌, చిన్నూరువిజయ్‌చౌదరి, భాస్కర్‌ చౌదరి, తొగట అనిల్‌, వాల్మీకి అశోక్‌, సంగాలబాలు, ఓంకార్‌, హోటల్‌మారుతిస్వామి, అడ్రా మహేశ, కేతినేని రాజ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-04T05:14:55+05:30 IST