ముక్తి ప్రదాయినీ.. మాతా..

ABN , First Publish Date - 2022-10-01T05:47:41+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా అమ్మవారికి వివిధ రకాల అలంకరణలు చేసి, పూజలు నిర్వహించారు.

ముక్తి ప్రదాయినీ.. మాతా..
శ్రీకృష్ణావతారంలో ఖాద్రీశుడు

పుట్టపర్తి/కదిరి, సెప్టెంబరు 30: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా అమ్మవారికి వివిధ రకాల అలంకరణలు చేసి, పూజలు నిర్వహించారు. లేపాక్షిలో దుర్గాదేవికి బాలాత్రిపుర సుందరీదేవి అలంకరణ చేశారు. కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి.. శ్రీదేవీభూదేవి అమ్మవార్లతోటి కృష్ణావతార అలంకారుడై భక్తులకు దర్శనమిచ్చాడు. వేణువును చేత పట్టుకున్న ఖాద్రీశుడిని దర్శించుకుని, భక్తులు పరవశించిపోయారు. స్వామివారిని కదిరి మల్లెలతో అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో రెండోరోజు వేదపురుషసప్తాహజ్ఞాన యజ్ఞాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా సత్యసాయి విద్యార్థుల భక్తిగీతాల ఆలాపన సందర్శకులను అలరింపజేసింది. అనంతరం మహాసమాధిని దర్శించుకున్నారు.

Read more