ఎన్నాళ్లిలా..?

ABN , First Publish Date - 2022-12-12T00:10:37+05:30 IST

ఓబుళదేవరచెరువు మండలంలోని సున్నంపల్లి సమీపాన సోమావతి నదిపై నిర్మించిన వంతెన మూడు నెలల క్రితం వర్షపు నీటి ఉధృతికి కొట్టుకుపోయింది.

ఎన్నాళ్లిలా..?
దెబ్బతిన్న వంతెనపై అతికష్టమ్మీద వెళ్తున్న ప్రజలు

ఓబుళదేవరచెరువు మండలంలోని సున్నంపల్లి సమీపాన సోమావతి నదిపై నిర్మించిన వంతెన మూడు నెలల క్రితం వర్షపు నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో మండల కేంద్రం నుంచి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన మ రమ్మతులకు ప్రతిపాదనలు పంపారు. ఇటీవల రింగులు వేసి, వదిలేశారు. మట్టి వేయలేదు. గత్యంతరం లేక ప్రజ లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, రింగుల పైనుంచే వంతెన దాటుతున్నారు. ఏమాత్రం కాలుజారినా.. పట్టుతప్పినా గాయాలపాలు కావాల్సిందే. పలువురు కిందపడి, గాయపడ్డారు కూడా. అయినా పాలకులు, అధికారుల్లో చలనం లేదు. మూడు నెలలుగా ప్రజలు అవస్థలు పడుతున్నా.. మరమ్మతులు చేపట్టిన పాపాన పోలేదు. దీంతో ప్రజలు ఎన్నాళ్లీ తిప్పలు అని ఆవేదన చెందుతున్నారు.

- ఓబుళదేవరచెరువు

Updated Date - 2022-12-12T00:11:04+05:30 IST

Read more