మల్బరీ రైతులకు సబ్సిడీ దెబ్బ

ABN , First Publish Date - 2022-09-11T05:10:48+05:30 IST

ఇప్పటికే నష్టాల్లో ఉన్న మల్బరీ రైతులకు ప్రభుత్వం సబ్సిడీ రద్దు రూపంలో మరో దెబ్బ కొట్టింది. ఎకరాలోపు మల్బరీ పంట సా గుచేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ, ప్రోత్సాహకాలు రద్దు చేసింది.

మల్బరీ రైతులకు సబ్సిడీ దెబ్బ
రైతు సాగు చేసిన మల్బరీ తోట

ఎకరాలోపు సాగు చేస్తే ప్రోత్సాహకాలు రద్దు


మడకశిర రూరల్‌, సెప్టెంబరు 10: ఇప్పటికే నష్టాల్లో ఉన్న మల్బరీ రైతులకు ప్రభుత్వం సబ్సిడీ రద్దు రూపంలో మరో దెబ్బ కొట్టింది. ఎకరాలోపు మల్బరీ పంట సా గుచేసే  రైతులకు  ప్రభుత్వం  సబ్సిడీ, ప్రోత్సాహకాలు రద్దు చేసింది. దీంతో సన్న, చిన్నకారు మల్బరీ రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో వెయ్యి మంది మ ల్బరీ రైతులు ఉన్నారు. ప్రభుత్వం ఎన్నోఏళ్లుగా మల్బరీ పంట సాగుచేసే రైతులకు ప్రో త్సాహకాలు అందిస్తున్నది. ఒక మొక్కకురూ.రెండు చొప్పున ఎకరాకు 3వేల మొక్కలకు రూ.6 వేలు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ప్రస్తుతం సన్న, చిన్నకారు రైతులకు  వాటి ని రద్దు చేసింది. దీంతో రైతులు ఆందోళన చేందుతున్నారు. ఉన్నతాధికారులు స్పం దించి రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, సబ్సిడీ రద్దు చేయకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


కల్లుమర్రికి చెందిన మల్బరీ రైతు నారాయణప్ప మాట్లాడుతూ  సన్న, చిన్నకారు మల్బరీ రైతులకు ఇచ్చే ప్రోత్సాకాలు ప్రభుత్వం కొనసాగించాలన్నారు.  చాలామంది  ఎకరాలోపు మల్బరీ పంట సాగుచేసే సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉన్నారన్నారు. నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలి. సిరికల్చర్‌ ఏడీ రాజునాయక్‌ను వి వరణ కోరగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎకరాలోపు మల్బరీ పంట సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు, సబ్సిడీ వర్తించవని పేర్కొన్నారు.


Read more