ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పూజలు

ABN , First Publish Date - 2022-11-30T00:00:32+05:30 IST

పట్టణంలోని ఎస్‌ఎల్‌వీ మార్కెట్‌ పాత బస్టాండ్‌ వద్ద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నాగులకట్ట దేవాలయంలో మంగళ వారం షష్ఠిపూజలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పూజలు

ధర్మవరంరూరల్‌, నవంబరు29: పట్టణంలోని ఎస్‌ఎల్‌వీ మార్కెట్‌ పాత బస్టాండ్‌ వద్ద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నాగులకట్ట దేవాలయంలో మంగళ వారం షష్ఠిపూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు విజయ్‌ కుమార్‌శర్మ, శంకరశర్మ వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి, విశేషపూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తుల చేత నాగదేవతలకు క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, పుష్పయాగం, రుద్రాభిషేకం చేయించినట్లు అర్చకులు తెలిపారు. పూజాకార్యక్రమానికి పట్టణవాసులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Updated Date - 2022-11-30T00:00:32+05:30 IST

Read more