విద్యార్థి ఆత్మహ త్య

ABN , First Publish Date - 2022-08-17T05:33:10+05:30 IST

బాగా చదువుకోవాలని తల్లితండ్రులు మందలించినందుకు ఇంటర్‌ విద్యార్థి హరిప్రసాద్‌ (17) ఆత్మహత్య చేసుకున ్న ట్లు పోలీసులు తెలిపారు.

విద్యార్థి ఆత్మహ త్య
విద్యార్థి హరిప్రసాద్‌ ( ఫైల్‌ )పుట్టపర్తి,  ఆగస్టు 16: బాగా చదువుకోవాలని తల్లితండ్రులు మందలించినందుకు ఇంటర్‌ విద్యార్థి హరిప్రసాద్‌ (17) ఆత్మహత్య చేసుకున ్న ట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి లోని బీడుపల్లికి చెందిన లక్ష్మీదేవి, ఆంజనేయులు కుమారుడు స్థానిక ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతడు మొదటి సంవత్సరం ఫెయిల్‌కావడంతో మొదటి సెమిస్టర్‌ పరీక్ష రాశాడు. బాగా చదువుకోవాలని ఈ సారైనా పాస్‌కావాలని, బాగా చదువుకుంటే బాగుపడతావని తల్లితండ్రులు అతడిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన హరిప్రసాద్‌ ఎవరూలేని సమయంలో ఇంట్లో ఫ్యానకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కగా నొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లితండ్రులు బోరున విలపించారు.  కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు ఆర్బన సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపారు.Read more