ఎస్కేయూ హాస్టళ్లలోబువ్వ కోసం పోరు

ABN , First Publish Date - 2022-10-03T06:09:03+05:30 IST

ఎస్కేయూలో హాస్టళ్ల నిర్వహణ పేరుతో చేతివాటం ప్రదర్శిస్తున్నా రని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. భోజనం తయారీకి అవసరమైన సరుకులు, పాలు, కూరగాయలు సరఫరాలో టెండర్‌ దారులు, అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతు న్నారని మండిపడుతు న్నారు. మెస్‌ ఫీజులు పెంచినా తమకు నాణ్యమైన భోజ నం అందడంలేదని మండిపడుతున్నారు.

ఎస్కేయూ హాస్టళ్లలోబువ్వ కోసం పోరు
ఎస్కేయూ ముఖద్వారం

అందని నాణ్యమైన భోజనం

నిర్వహణలో అధికారుల చేతివాటం 

సరుకుల సరఫరాదారులతో కుమ్మక్కు!

విద్యార్థులు లేకుండానే ధరల నిర్ణయం

ప్రశ్నించినవారికి అధికారుల బెదిరింపులు

మంచి భోజనం కోసం రోడ్డెక్కుతున్న విద్యార్థులు

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం


 అనంతపురం సెంట్రల్‌  : ఎస్కేయూలో హాస్టళ్ల నిర్వహణ పేరుతో చేతివాటం ప్రదర్శిస్తున్నా రని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు.   భోజనం తయారీకి అవసరమైన సరుకులు, పాలు, కూరగాయలు సరఫరాలో టెండర్‌ దారులు, అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతు న్నారని మండిపడుతు న్నారు.  మెస్‌ ఫీజులు పెంచినా తమకు నాణ్యమైన భోజ నం అందడంలేదని మండిపడుతున్నారు.  ఇదేమని ప్రశ్నించిన వారిని టీసీలిచ్చి ఇంటికి పంపుతామని, ఫెయిల్‌ చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన చెందుతు న్నారు. సమస్యలను పరిష్కరించాలని వీసీ రామకృష్ణారెడ్డికి విన్నవించినా పోలీసులతో బెదిరిస్తున్నా రని మండిపడుతున్నారు. వీటన్నిటిపై ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఫలిత ంలేదని ఇక తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిసున్నారు.


11హాస్టళ్లు.. 4 వేల మంది విద్యార్థులు..

వర్సిటీలో మొత్తం 11 హాస్టళ్లలో 4వేలకుపైగా విద్యార్థులు వసతి పొందతున్నారు. నర్మదా, యమునా, కావేరి, గోదావరి హాస్టళ్లలో బాలికలు వసతి పొందుతు న్నారు. వీరందరికి కామనమె్‌సను నిర్వహిస్తున్నారు. మహానంది, పినాకిని, మందాకిని, గంగా, కృష్ణ, చిత్రావతి, తుంగభద్ర వసతి గృహాలను బాలురకు కేటాయించారు. చిత్రావతి హాస్టల్‌లో ఉంటున్న ఎంబీఏ, పీహెచడీ విద్యార్థులకు, తుంగభద్రలో ఉంటున్న ఇంజనీరింగ్‌ విద్యా ర్థులకు సంబంధిత హాస్టళ్లలోనే మెస్‌ను ఏర్పాటుచేశారు. మిగిలిన వసతి గృహాల విద్యార్థులందరికీ కామన మెస్‌ ద్వారా భోజనం వడ్డిస్తున్నారు. వీటి పర్యవేక్షణకు వర్సిటీ యాజమాన్యం ఒక వార్డెన, ముగ్గురు అడిషనల్‌ వార్డెన్లు, 11మంది డిప్యూటీ వార్డెనలను నియమించింది.


పర్యవేక్షకుల బెదిరింపులు...

హాస్టళ్లలో తగిన సదుపాయాలు కల్పించడం, నాణ్య మైన ఆహారాన్ని అందించడం, రోజువారి హాజరును లెక్కించడం తదితర అంశాల్లో ఏలోటు లేకుండా పర్య వేక్షించాల్సిన అధికారులు తమపై కర్రపెత్తనం చేస్తున్నా రని విద్యార్థులు మండిపడుతున్నారు. కుళ్లిపోయిన కూరగాయలతో కూరలు, ఉడకని అన్నం వడ్డిస్తున్నారని డిప్యూటీ వార్డెనలకు ఫిర్యాదు చేస్తే తమపైనే కస్సుబుస్సు మంటున్నారని వాపోతున్నారు. గట్టిగా ప్రశ్నించిన విద్యా ర్థులను పెట్టింది తినండి లేకుంటే వెళ్లిపోండంటూ దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ వార్డెన పర్యవేక్షణలోపంతో నెలలతరబడి వినియోగిస్తున్న వంటనూనెతోనే పూరీలు వేయించి వడ్డించారని వీసీకి ఫిర్యాదు చేస్తే, ఆయనే పోలీసులచే నిర్భందింపజేసి విద్యార్థులపైనే చిందులేశాడని గుర్తు చేసుకుంటున్నారు.  


రోడ్డెక్కుతున్న విద్యార్థులు...

నాణ్యమైన భోజనం పెట్టడంలేదని పలుమార్లు హాస్టల్‌ విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. భోజనం పేట్లతో వర్సిటీ ముఖద్వారంవద్ద వినూత్న రీతిలో నిరసనలు చేస్తున్నారు. అయినా అధికారుల్లో చలనం రావడంలేదని విద్యార్థులు వాపోతున్నారు. నిరసన సమయంలో పోలీసులతో బెదిరించడం, వార్డెన, రిజిస్ర్టార్‌, రెక్టార్‌ వంటి అధికారులు ఇకనుంచి తప్పులు జరగవని బుజ్జగించడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్ల నిర్వహణ తీరుపై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా వారు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమకంటూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఉన్నా.. ఏనాడు తమ సమస్యలపై స్పందించలేదని, అసలు ఆ అధికారి విధుల్లో ఉన్నారా.. లేక యాజమాన్యం అందించే ముడుపుల మత్తులో పడ్డారా అంటూ ప్రశ్నిస్తున్నారు.  ఏకపక్షంగా టెండర్లు...

హాస్టల్‌ విద్యార్థుల భోజనం తయారీకి అవసరమైన సరుకులు, పాలు, కూరగాయల సరఫరాకు మూడు నెలల కు ఒకసారి టెండర్లు నిర్వహిస్తారు. టెండర్‌ సమయానికి మార్కెట్‌ ఽధరలకంటే తక్కువగా కోట్‌చేసిన వారికి సరఫరాను అప్పగించాలి. అయితే టెండర్‌దారులతో హాస్టళ్ల పర్యవేక్షకులు కుమ్మ క్కై అధిక ధరలకు ఏకపక్ష టెండర్లు నిర్వహిస్తున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా విద్యార్థుల సమక్షంలో టెండర్‌దారులతో వేలంపాట నిర్వహించాలి. డిప్యూటీ వార్డెనలు, వార్డెన, హాస్టల్‌ ఆఫీస్‌ అధికారులు సంయుక్తాధ్వర్యంలో సరఫరాదారులు వారు సరఫరాచేసే సరుకులు, పాలు, కూరగాయల తదితరాల ధరలను నిర్ణయిచాల్సి ఉన్నా విద్యార్థులు లేకుండానే అధిక ధరలకు కోట్‌చేస్తున్నారని వాపోతున్నారు. విద్యార్థుల సమక్షంలోనే వేలంపాట నిర్వహిస్తున్నామంటున్న అధికారులు వార్డెన తన స్కాలర్స్‌ను, డిప్యూటీ వార్డెనలు వారి స్టూడెంట్స్‌ను కొంతమందిని చూపించి మ.మ అనిపిస్తున్నారని మండిపడుతున్నారు.Read more