నత్తనకడన ఆర్బీకేల నిర్మాణం

ABN , First Publish Date - 2022-07-18T06:04:34+05:30 IST

రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణం మండలంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మా రింది.

నత్తనకడన ఆర్బీకేల నిర్మాణం
వేమారెడ్డిపల్లిలో గుంతలకే పరిమితమైన ఆర్బీకే నిర్మాణం

పలుచోట్ల గుంతలకే పరిమితం

ఓబుళదేవరచెరువు, జూలై 17: రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణం మండలంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మా రింది. మండల వ్యాప్తంగా 12 రైతు భరోసా కేంద్రాలుండగా... చింత మానుపల్లి, అల్లాపల్లి, కొండకమర్ల -1 పంచాయతీలో మినహా మిగిలిన చోట్ల భవనాల నిర్మాణం గుంతలు, పునాదులు, గోడలకు పరిమితమైంది. దీంతో చాల చోట్ల ప్రభుత్వ పాఠశాలలో, పంచాయతీ కార్యాలయాల్లో రైతు భరోసా కేంద్రాలను కొనసాగిస్తున్నారు. రైతులకు సరిపడా ఎరువులు, ఇతర సబ్సిడీ ధాన్యాల విత్తనాలను నిలువ ఉంచడంతో పాటు రైతులకు ఎప్పటకప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా చాలచోట్ల రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వకపోగా.... ఆర్బీకే సిబ్బంది పంచాయతీ కార్యాలయానికి పరిమితమవు తున్నారు. ప్రధానంగా ఓడీసీ -1 ఆర్బీకే కేంద్రాన్ని వేమారెడ్డిపల్లిలో నిర్మించాలని... యేడాది క్రితమే  అక్కడికి సిమెంటు, కంకర తరలించి గుంతలు తీశారు. అయితే సంబం ఽధిత కాంట్రాక్టర్‌ చొరవ చూప కపోవడంతో పనులు అక్కడికే ఆగి పోయాయి. అలాగే వెంకటాపురం పంచాయతీలోని నారప్పగారిపల్లి సమీపంలో చెత్తసేకరణ కేంద్రం వద్ద ఆర్బీకే నిర్మాణం గుంతలకే పరిమితమైంది. ఇలా చాలాచోట్ల గుంతలకే పరిమితం కావడంతో ఆర్బీకేల నిర్మాణం ఇప్పట్లో జరిగేనా అన్న సందేహం ప్రజలు, వ్యవసాయాశాఖ సిబ్బంది నుంచి వ్యక్తమవుతోంది. వీటికి తోడు ఆర్బీకే నిర్మాణ పనులు సమీక్షించడానికి సంబంధిత జేఈలు లేకపోవడం వల్లే పర్యవేక్షణ కూడా కొరవడి పనులు ముందుకు సాగడంలేదన్న విమర్శలున్నాయి. వేమారెడ్డిపల్లిలో ఉపాధి పథకం కింద 90శాతం, వ్యవసాయశాఖ 10 శాతం కలిపి రూ.21.80 లక్షలతో ఆర్బీకే భవనం నిర్మించాల్సి ఉంది. అయితే ఎవరూ నిర్మించడానికి ముందుకు రాకపోవడంతో భవన నిర్మా ణం ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.   ఇప్పటికైనా సంబంఽఽధిత అధికారులు స్పందించి ఆర్బీకేల నిర్మాణంపై దృష్టి సారించి, పక్కా భవ నాలను నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయాగ్రామాల రైతులు కోరుతున్నారు. 

ఉన్నతాధి కారులు తీసుకెళ్తాం- గుప్త, పీఆర్‌ జేఈ 

మండల వ్యాప్తంగా చాల చోట్ల రైతు భరోసా కేంద్రాల నిర్మాణం గుంతలకే పరమితమైన విషయం వాస్తవమే. పనుల పర్యవేక్షణకు సంబంధించి జేఈలు లేకపోవడం, కొన్ని చోట్ల ఇనచార్జులుగా ఉండడంతో నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు. ఆగిన నిర్మాణ పనుల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పనులు ప్రారంభించేలా చూస్తాం అన్నారు. 


Updated Date - 2022-07-18T06:04:34+05:30 IST