ఎస్‌ఎ్‌సబీఎన్‌ సర్వసభ్య సమావేశం బహిష్కరణ

ABN , First Publish Date - 2022-01-24T05:12:29+05:30 IST

ఎస్‌ఎ్‌సబీఎన్‌లో ఏకపక్ష విధానాలు, ఇష్టారాజ్యం కొనసాగుతూనే ఉంది. ఎస్‌ఎ్‌సబీఎన్‌ యాజమాన్యం ఏకపక్షంగా వ్యహరించడం తోపా టు, ఇతర సభ్యులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో... కొంతమంది స భ్యులు సమావేశాన్ని బహిష్కరించారు.

ఎస్‌ఎ్‌సబీఎన్‌ సర్వసభ్య సమావేశం బహిష్కరణ

నలుగురికి మాట్లాడే అవకాశం ఇవ్వని వైనం

ఏకపక్షంగా సమావేశం కొనసాగింపు 

ఇష్టారాజ్యంగా కళాశాల యాజమాన్యం

అనంతపురం విద్య, జనవరి 23 : ఎస్‌ఎ్‌సబీఎన్‌లో ఏకపక్ష విధానాలు, ఇష్టారాజ్యం కొనసాగుతూనే ఉంది. ఎస్‌ఎ్‌సబీఎన్‌ యాజమాన్యం ఏకపక్షంగా వ్యహరించడం తోపా టు, ఇతర సభ్యులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో... కొంతమంది స భ్యులు సమావేశాన్ని బహిష్కరించారు. ఆదివారం అనంతపురం ఏడీఎన్‌ఈ ట్రస్టు (ఎస్‌ఎ్‌సబీఎన్‌ విద్యాసంస్థలు) పాలకవర్గ సర్వసభ్య సమావేశం కళాశాలలో నిర్వహించా రు. అయితే సభ్యులు వి. జయచంద్ర చౌద రి, పీ.జి విఠల్‌, మేడా రామ్‌నాథ్‌, బి.గౌతమ్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కళాశాలలో పీఎల్‌ఎన్‌ రెడ్డి వర్గం అడ్డగోలు నిర్ణయాలు,  కోట్లాది రూపాయల కుంభకోణాలు, విద్యార్థుల శ్రేయస్సుకు వి ఘాతం కలిగించడం, కళాశాల ప్రతిష్టను మసకబార్చడాన్ని వీరు మొదటి నుంచి తప్పుబడుతున్నారు. 2019-20, 2020-21 సంవత్సరాల అ కౌంట్స్‌లో భారీగా అవకతవకలు జరగడం తోపాటు, విద్యార్థుల  ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ అక్రమాలు, కళాశాల నిధుల దుర్వినియోగం తదితర అంశాలపై కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ను సై తం కలిసి విచారణ చే యాలని కోరారు. వీటిపై జేసీ ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీని కూడా వేశారు. కళాశాలలో జరిగిన ఘటనలపై కోర్టులో పిటిషన్‌ కూడా నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏకపక్షంగా పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించ డంపై కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే  సమా వేశంలో ఇతర సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తే....  ఎ క్కడ తమ అక్రమాలు బయటపడుతాయోనని, పాలక వర్గ సర్వసభ్య సమావేశంలో సైతం వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో వారు సమావేశాన్ని బహి ష్కరించారు. వీరితోపాటు మరికొందరు సంతకాలు చేసి సమావేశాన్ని బహిష్కరించారు. దొడ్డిదారి పాలకవర్గంలో చేర్చుకున్న మరో 30 మంది సభ్యులతో సమావేశాన్ని కొనసాగించినట్లు సమాచారం. 


Read more