ఆధ్యాత్మిక శోభ

ABN , First Publish Date - 2022-10-02T05:19:23+05:30 IST

వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఆధ్యాత్మిక శోభ
పాతూరు అమ్మవారిశాలలో వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి

వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆరో రోజున స్వామివారు హనుమద్‌వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, తోమాల, అలంకార సేవలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో మూలానక్షత్ర, దీక్షాహోమాలను నిర్వహించారు. సాయంత్రం శ్రీవారు హనుమద్‌ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పాతూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ గర్భగుడిలో వాసవీమాతను రంగురాళ్లతో, ఆవరణలో ఉత్సవమూర్తికి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామిగా అలంకరించారు.                                       - అనంతపురం కల్చరల్‌

Read more