విద్యాజ్యోతికి విశేష స్పందన

ABN , First Publish Date - 2022-04-10T06:53:29+05:30 IST

విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆంధ్రజ్యోతి, ఏబీఎన ఆధ్వర్యంలో గార్డెనసిటీ యూనివర్సిటీ సమక్షంలో నిర్వహించిన విద్యాజ్యోతి సదస్సుకు విశేష స్పందన కనిపించింది.

విద్యాజ్యోతికి విశేష స్పందన
విద్యాజ్యోతి సదస్సును ప్రారంభిస్తున్న ఆర్‌ఐఓ సురేష్‌బాబు

తరలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు

అనంతలో సదస్సుకు 30 విద్యాసంస్థలు

సద్వినియోగం చేసుకోవాలని నిపుణుల సూచన

ఏబీఎన, ఆంధ్రజ్యోతి కృషికి ఆర్‌ఐఓ అభినందనలు

అనంతపురం టౌన/కల్చరల్‌ ఏప్రిల్‌ 9: విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆంధ్రజ్యోతి, ఏబీఎన ఆధ్వర్యంలో గార్డెనసిటీ యూనివర్సిటీ సమక్షంలో నిర్వహించిన విద్యాజ్యోతి సదస్సుకు విశేష స్పందన కనిపించింది. జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ అంబేద్కర్‌ భవనలో శనివారం ఏర్పాటు చేసిన ఈ సదస్సును ఆర్‌ఐఓ సురేష్‌బాబు ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన 30 ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఇందులో పాల్గొన్నాయి. గార్డెనసిటీ యూనివర్సిటీ, రామయ్య సైన్స వర్సిటీ, రేవా యూనివర్సిటీ, ఆచార్య ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలనజీ, కేంబ్రిడ్జ్‌, సీఎంఆర్‌ యూనివర్సిటీ, కేఎస్‌ఐటీ వంటి దిగ్గజాలు హాజరయ్యాయి. ఇంటర్‌ తర్వాత ఎలాంటి కోర్సులు చదివితే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఆయా సంస్థల ప్రతినిధులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. సదస్సుకు వందలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు తరలివచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి కర్ణాటక జీఎం జీవీ శ్రీకాంత, డీజీఎం ఆర్‌ సుధాకర్‌, ఈవెంట్‌సైడ్‌ వే సిక్స్‌ డైరెక్టర్‌ దేవరాజు, యాక్సిస్‌ సీఈఓ కేఆర్‌ భాస్కర్‌రెడ్డి, ఆచార్య యూనివర్సిటీ డైరెక్టర్‌ గణేష్‌, గార్డెనసిటీ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రేమ కులకర్ణి, రామయ్య యూనివర్సిటీ ప్రతినిధి చేతన సింగై, సౌందర్య కాలేజ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వాణి రమేష్‌, బ్యూరో ఇనచార్జి వెలుగు రామకృష్ణ, యాడ్స్‌ మేనేజర్‌ మారుతి, సిబ్బంది పాల్గొన్నారు. 






అభినందనీయం...

ఉన్నత చదువులకు వెళ్లే చాలా మంది విద్యార్థులు ఏ కోర్సు తీసుకోవాలో, ఎక్కడ చదవాలో తెలియ ఇబ్బందులు పడుతుంటారు. విద్యార్థుల భవిష్యత్తుకు కోర్సు, కళాశాలే కీలకం. ఏబీఎన, ఆంధ్రజ్యోతి ఇన్ని కళాశాలలు, యూనివర్సిటీలను ఒకచోటకు చేర్చి, విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం అభినందనీయం. విద్యే ఆయుధం. విద్యార్థుల భవిష్యత్తుకు ఈ ఈవెంట్‌ దశ దిశను నిర్దేశిస్తుంది. సద్వినియోగం చేసుకోవాలి.

- సురేష్‌బాబు, ఆర్‌ఐఓ


మంచి నిర్ణయంతోనే ముందుకు.. 

మంచి నిర్ణయం తీసుకున్నప్పుడే భవిష్యత్తులో ముం దుకు పోగలుగుతాం. ఎంత తెలివి ఉన్నా అవగాహన లేకుండా కోర్సులు, కళాశాలలు ఎంచుకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. విద్యకు ప్రాధాన్యం పెరిగింది. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. మంచి కోర్సును ఎంచుకుని, మంచి కళాశాలలో చదవినప్పుడే ఆశయం నెరవేరుతుంది. బెంగళూరులో మంచిమంచి కళాశాలలు ఉన్నాయి. మీ దగ్గరకే వచ్చాయి. బాగా ఆలోచించి అడుగులు వేయాలి.

- ప్రొఫెసర్‌ గణేష్‌, ఆచార్య యూనివర్సిటీ డైరెక్టర్‌


విద్యార్థుల కోసమే...

ఉన్నత విద్య విషయంలో చాలామంది విద్యార్థులకు సరైన అవగాహన ఉండదు. మంచి కోర్సులు, మంచి కాలేజీలను ఎంచుకుంటే.. అందుకు తగ్గ ఉద్యోగాలు వస్తాయి. విద్యార్థుల కోసమే విద్యాజ్యోతి పేరిట ఒకేచోట ఇన్ని ప్రముఖ విద్యాసంస్థలు ప్రదర్శన చేశాయి. అన్ని యూనివర్సిటీలకూ యూజీసీ ఆమోదం ఉంది. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉన్నత స్థానానికి చేరుకోవాలి. 

- ప్రేమ కులకర్ణి, గార్డెనసిటీ యూనివర్సిటీ


విద్యార్థుల భవిష్యత్తుకే విద్యాజ్యోతి... 

ఇంటర్‌ తర్వాత ఏం చదవాలో తెలియక చాలా మంది విద్యార్థులు తప్పటడుగులు వేసి నష్టపోతుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రజ్యోతి తనవంతుగా విద్యాజ్యోతి సదస్సును ఏర్పాటు చేసింది. మంచి కళాశాలలు, యూనివర్సిటీలు ఇందులో పాల్గొంటున్నాయి. ఏ కోర్సులు, ఏ కళాశాలలో చదువుకోవచ్చు, భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయో ఇక్కడ నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు. ఇంతపెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు తరలివచ్చి అనుమానాలను నివృత్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా విద్యార్థుల కోసం ఇలాంటి సదస్సులు కొనసాగిస్తాం. 

- జీవీ శ్రీకాంత, ఆంధ్రజ్యోతి కర్ణాటక జీఎం


అవకాశాలు తెలుస్తాయి..

యూనివర్సిటీలు, ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీలు ఎన్ని ఉన్నా, ప్లేస్‌మెంట్లు అధికంగా చూపించే విద్యాసంస్థలు కొన్నే ఉంటాయి. అటువంటి విద్యాసంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం ఆనందించదగ్గ విషయం. ఇంటర్‌ తర్వాత ఏ కోర్సు తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలుంటాయి, ప్లేస్‌మెంట్‌ వివరాలను తెలుసుకునేందుకు విద్యాజ్యోతి వంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. 

- మేఘన, ఇంటర్‌ విద్యార్థిని


మంచి వేదిక..

ఇంటర్‌ తర్వాత ఏ కోర్సు తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకునేందుకు ఇది మంచి వేదిక. మాకు తెలియని ఎన్నో అంశాలను విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా తెలుసుకోగలిగాం. తొందరలోనే పరీక్షలు ఉన్నాయి. ఆ తరువాత ఏ కోర్సు తీసుకోవాలో నిర్ణయించుకునేలా అవగాహన కలిగింది. 

- కార్తికేయ, ఇంటర్‌ విద్యార్థి


విద్యపట్ల తపన ఎక్కువే... 

అనంతపురం విద్యార్థుల్లో చదువు పట్ల తపన ఉండడం గమనించాము. మా ఇనస్టిట్యూట్‌ ద్వారా ఇంజనీరింగ్‌తోపాటు ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ, బీకామ్‌ కోర్సులను అందిస్తున్నాం. చాలామంది విద్యార్థులు ఈ కోర్సుల గురించి అడిగి తెలుసుకోవడం ఆనందంగా అనిపించింది.

- కార్తీక్‌, హెడ్‌ ఆఫ్‌ అడ్మిషన్స, కేంబ్రిడ్జ్‌ ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, బెంగుళూరు


భవిష్యత్తుకు ప్లానింగ్‌.. 

బెంగళూరులోని యూనివర్సిటీలు, విద్యాసంస్థలు అందించే కోర్సుల పట్ల అనంత విద్యార్థులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఏ కోర్సు చేయడం వల్ల ఎలాంటి భవిష్యత్తు ఉంటుందని అడిగి తెలుసుకుంటున్నారు. మిగిలిన కోర్సులతో పోలిస్తే అనంతపురం విద్యార్థులు కామర్స్‌ కోర్సుల పట్ల చాలా తక్కువమంది ఆసక్తి కనబరుస్తున్నారు.

- రాఘవేంద్ర, అడ్మిషన్స మేనేజర్‌, ఎయిమ్స్‌ ఇనస్టిట్యూట్స్‌, బెంగళూరు


మంచి అవకాశం..

ఇంటర్‌ పూర్తికాక ముందే కోర్సులు, ప్లేస్‌మెం ట్లపై అవ గాహన పొందేం దుకు ఆంధ్రజ్యోతి యాజమాన్యం మంచి అవకాశం కల్పించింది. ఏయే కళాశాలు ఎలాంటి కోర్సులు అందిస్తున్నాయో, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో అవగాహన వచ్చింది. విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే అనుమానాలు నివృత్తి అవుతాయి. 

- నిఖిల, ఇంటర్‌ విద్యార్థిని


ప్రయాస తగ్గింది..

నా కూతురు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం  చదువుతోంది.ఉన్నత విద్యను ఎక్కడ చదివించాలని ఆలోచిస్తున్నాం.  ఇలాంటి సమయంలో బెంగళూరులోని ప్రఖ్యాత యూనివర్సిటీలు, కాలేజీలను అనంతపురం నగరానికి తీసుకువచ్చి ఎడ్యుకేషనల్‌ ఈవెంట్‌ నిర్వహించడం అభినందనీయం. మాలాంటి తల్లిదండ్రులకు బెంగళూరు వెళ్లే పని లేకుండా ఇక్కడే కోర్సులు, కాలేజీలపై అవగాహన కలిగింది. 

- మాధవి, విద్యార్థిని తల్లి, పామురాయి


ఇంజనీరింగ్‌, మెడిసినపై ఆసక్తి... 

గతంతో పోలిస్తే ఇటీవల చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్‌, మెడిసిన కోర్సులపైనే అధికంగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఎడ్యుకేషన ఈవెంట్‌కు అనంత విద్యార్థుల నుంచి స్పందన బాగా వచ్చింది. ఏ కోర్సు వల్ల ఎలాంటి ప్రయాజనాలు ఉంటాయో తెలుసుకోడానికి విద్యార్థులు ఆసక్తి కనబర్చారు.

- మెశెల్లీ, దీపిక, న్యూ హారిజన కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, బెంగళూరు


ప్రత్యేక కోర్సులను ఎంచుకుంటున్నారు..

మా యూనివర్సిటీ ద్వారా ఆర్కిటెక్చర్‌లో బ్యాచులర్‌ కోర్సు, పీహెచడీ, బీటెక్‌, బీకాం, ఎంకాం, బీబీఏ, ఎంబీఏ, బీఏ, ఎల్‌ఎల్‌బీ వంటి కోర్సులను అందిస్తున్నాం. ఇతర జిల్లాలతో పోలిస్తే అనంతపురంలో నిర్వహించిన ఎడ్యుకేషన ఈవెంట్‌కు విద్యార్థుల నుంచి అనూహ్యస్పందన లభిస్తోంది. ప్రత్యేక కోర్సుల గురించి మరీ అడిగి తెలుసుకుంటున్నారు.

- గౌతమి, సీఎంఆర్‌ యూనివర్సిటీ


క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు కేరాఫ్‌ రామయ్య వర్సిటీ

చేతన సింగయ్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 

అనంతపురం క్రైం, ఏప్రిల్‌ 9: క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు బెంగళూరులోని రామయ్య యూనివర్శిటీ కేరా్‌ఫగా నిలుస్తుందని కర్ణాటక రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌, రామయ్య యూనివర్శిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ చేతన సింగయ్‌  పేర్కొన్నారు. విద్యాజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, యూనివర్శిటీ విశేషాలను ఆంధ్రజ్యోతికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్‌ ఎడ్యుకేషన పాలసీని బెంగళూరులోని రామయ్య యూనివర్శిటీ ఖచ్చితమైన నిబంధనలతో అమలు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే ఒక బ్యాచ ఏడాది చదువు పూర్తి చేసిందని, మరో బ్యాచ అడ్మిషన్స పొందుతున్నారని తెలిపారు. విద్యా విభాగంలో 61 ఏళ్ల అనుభవమున్న యూనివర్శిటీ తమదని పేర్కొన్నారు. 


మీ వర్శిటీలో ఎలాంటి కోర్సులు అందిస్తున్నారు...?

ఇంజనీరింగ్‌లో బీటెక్‌, ఎంటెక్‌  కోర్సులు, బీఎస్సీ ఆనర్స్‌, సైకాలజీ, డేటాసైన్స, బీసీఎస్‌ ఆనర్స్‌, ఎకనామిక్స్‌, బీఏ సోషియాలజీ ఆనర్స్‌ కోర్సులు అందిస్తున్నాం. ఈ కోర్సులు మూడేళ్లు పూర్తిచేసిన తరువాత ఉద్యోగాలు పొందవచ్చు. నాలుగేళ్లు పూర్తిచేస్తే యూజీసీ నిబంధనల మేరకు రీసెర్చ్‌ డిగ్రీ అర్హత కల్పిస్తాము. స్కూల్‌ ఆఫ్‌ లాలో భాగంగా  బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ ఆనర్స్‌ కోర్సులు ఉన్నాయి. 

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు ఎలా ఉంటాయి...?

యూనివర్శిటీలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 30-40శాతం ప్లేస్‌మెంట్లు కల్పిస్తాం. ఈ అండ్‌ వై, ప్రైజ్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యుసీ) తదితర సంస్థలు అందుబాటులో ఉన్నాయి. యూనివర్శిటీ నుంచి 20శాతం మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్తారు. 20కిపైగా అంతర్జాతీయ యూనివర్శిటీలతో టై అప్‌ కలిగిఉన్నాం. డేటా అనలిస్ట్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసర్స్‌ జాబ్స్‌ కూడా పొందవచ్చు. 

ప్రత్యేకంగా ఏమైనా శిక్షణ ఇస్తున్నారా..?

రామయ్య ఐఏఎస్‌ అకాడమీ విభాగం కింద ప్రత్యేకంగా సివిల్‌ సర్వీ్‌సకు సంబంధించి శిక్షణ అందిస్తాం. డిగ్రీ ఎంట్రీ ద్వారా వచ్చిన వారికి స్కాలర్‌షిప్‌ అందజేస్తాం. 

ఈ ఏడాది అడ్మిషన్లకు అవకాశం ఉందా...?

ఈ నెలలోనూ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తున్నాం. అడ్మిషన్ల కోసం 9686204883, 08045366616 నెంబర్లను, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎంఎ్‌సఆర్‌యుఏఎ్‌స.ఏసీ.ఇన వెబైసైట్‌లోనూ సంప్రదించవచ్చన్నారు. 

Updated Date - 2022-04-10T06:53:29+05:30 IST