AP News: ఎంపీ గోరంట్ల విషయంలో ఎస్పీ వ్యాఖ్యలు అసంబద్ధం: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2022-08-11T22:20:25+05:30 IST

ఎన్టీఆర్‌ జిల్లా: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) న్యూడ్ వీడియో (Nude Vedio) సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియో మహిళలను అగౌరవ పర్చేలా

AP News: ఎంపీ గోరంట్ల విషయంలో ఎస్పీ వ్యాఖ్యలు అసంబద్ధం: దేవినేని ఉమ

ఎన్టీఆర్‌ జిల్లా: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) న్యూడ్ వీడియో (Nude Vedio) సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియో మహిళలను అగౌరవ పర్చేలా ఉండడంతో ఎంపీపై చర్యలు తీసుకోవాలని టీడీపీ, వామపక్షాల నేతలు , మహిళా సంఘాల నాయకురాళ్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరూ ఫిర్యాదు చేయనందున గోరంట్ల సెల్ ఫోన్లో ఉన్న అసలు వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపడానికి వీలుపడదని  ఎస్పీ చెప్పడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ మాధవ్‌ వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపకుండా ఎస్పీ ఎలా మీడియా సమావేశం పెడతారని మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వర రావు (Ex. Minister Devineni Uma) ప్రశ్నిస్తున్నారు. వైసీపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు (Chandra babu), లోకేశ్‌, టీడీపీ నేతలపై బూతులు తిట్టిస్తున్నారని ఆరోపించారు. తెర వెనక ఉండి వ్యవహారం నడిపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-08-11T22:20:25+05:30 IST