-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Solve village problems and come to survey-NGTS-AndhraPradesh
-
గ్రామ సమస్యలను పరిష్కరించి సర్వేకు రండి
ABN , First Publish Date - 2022-09-08T05:32:25+05:30 IST
జిల్లేడు బండ ప్రాజెక్టు కట్టాలంటే ముం దుగా మా గ్రామసమస్యను పరిష్కరించి, ఆ తరువాత సర్వేకు రావాలని పొడరాళ్లపల్లి రైతులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుధారాణికి విన్నవించారు.

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌తో పొడరాళ్లపల్లి రైతులు
ముదిగుబ్బ, సెప్టెంబరు 7: జిల్లేడు బండ ప్రాజెక్టు కట్టాలంటే ముం దుగా మా గ్రామసమస్యను పరిష్కరించి, ఆ తరువాత సర్వేకు రావాలని పొడరాళ్లపల్లి రైతులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుధారాణికి విన్నవించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుధారాణి బుధవారం పొడరాళ్లపల్లిలో రైతులతో గ్రామసభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... మొదటగా ప్రాజెక్టుకు సంబంధించి భూముల సర్వే జరగాలని, ఆ తరు వాత జిల్లా అధికారులు వచ్చి రైతుల సమక్షంలోనే ఎకరాకు ఎంత ధర అనేది తెలియజేస్తామన్నారు. అంతవరకు భూ సర్వేను అడ్డుకోవద్దని తెలిపారు. అందుకు గ్రామస్థులు మాట్లాడుతూ... జిల్లేడు బండ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇక్కడి భూములు ముంపునకు గురవుతాయని ఇంతవరకు ఏ అధికారి ప్రకటించలేదన్నారు. స్థానిక రైతులను సంప్ర దించకుండా నేరుగా సర్వే చేస్తే ఎలా అని ప్రశ్నించారు. గ్రామానికి 200 మీటర్ల దూరంలోనే ప్రాజెక్టుకు సంబఽంధించి కరకట్ట నిర్మిస్తే... ఆ నీరు గ్రామంలో ఊరి గ్రామం మొత్తం దెబ్బతింటుందన్నారు. దీంతో స్థానికులు గ్రామాన్ని వదిలే పరిస్థితి ఏర్పడుతుం దని అధికారుల ఎదుట రైతులు వాపోయారు. ప్రాజెక్టునిర్మాణం కోసం భూములు కా వాలంటే మొదట పొడరాళ్లపల్లి వాసులకు పునరావాసం కల్పించాలన్నారు. పునరావాసం కల్పించకపోతే ప్రాజెక్టుకు భూములిచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చిచెప్పారు. రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ తిప్పేనాయక్, ప్రాజెక్టు ఈఈ వెంకటరమణారెడ్డి, డీఈ వేణుగోపాల్‌రెడ్డి, ముదిగుబ్బ తహసీల్దార్ నాగేంద్ర పాల్గొన్నారు.