అధిక వర్షాలతో ఊటెక్కిన నేల

ABN , First Publish Date - 2022-11-30T23:52:21+05:30 IST

భారీ వర్షాలకు అధికారుల అవగాహనా రాహిత్యం తోడవటంతో చీనీ రైతులకు తీవ్ర నష్టం మిగిలాయి. అధిక వర్షాలు, హెచ్చెల్సీకి నిర్విరామ నీటి విడుదల చీనీ రైతులను నిట్టనిలువునా ముంచేశాయి. చీనీతోటల్లో నీరు ఊబికి వస్తుండటంతో నేలంతా జలమయమై చెట్లు దెబ్బతింటున్నాయి. మండలంలోని గార్లదిన్నె, మర్తాడు, యర్రగుంట్ల, బూదేడు, సంజీవపురం, కమలాపురం, కొట్టాలపల్లి, ముకుందాపురం పెనకచెర్ల తదితర గ్రామాల్లో అధిక సంఖ్యలో రైతులు చీనితోటలను సాగుచేశారు.

 అధిక వర్షాలతో ఊటెక్కిన నేల
ఊటెక్కిన నేల

జలమయమైన తోటలు

చచ్చిపోతున్న పండ్ల చెట్లు

హెచ్చెల్సీకి నీటి విడుదలతో మరింతగా నష్టం

నష్టనివారణకు ప్రభుత్వ చర్యలు శూన్యం

గార్లదిన్నె, నవంబరు 30: భారీ వర్షాలకు అధికారుల అవగాహనా రాహిత్యం తోడవటంతో చీనీ రైతులకు తీవ్ర నష్టం మిగిలాయి. అధిక వర్షాలు, హెచ్చెల్సీకి నిర్విరామ నీటి విడుదల చీనీ రైతులను నిట్టనిలువునా ముంచేశాయి. చీనీతోటల్లో నీరు ఊబికి వస్తుండటంతో నేలంతా జలమయమై చెట్లు దెబ్బతింటున్నాయి. మండలంలోని గార్లదిన్నె, మర్తాడు, యర్రగుంట్ల, బూదేడు, సంజీవపురం, కమలాపురం, కొట్టాలపల్లి, ముకుందాపురం పెనకచెర్ల తదితర గ్రామాల్లో అధిక సంఖ్యలో రైతులు చీనితోటలను సాగుచేశారు. ఈఏడాది ఎన్నడులేని విధంగా అధిక వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతం నుంచి నీరు ఎంపీఆర్‌ డ్యాంలోకి చేరింది. అధికంగా ఇనఫ్లో ఉండటంతో అధికారులు డ్యాం 10 గేట్లను ఎత్తి పెన్నానదికి నీటిని విడుదల చేశారు. గత నాలుగు నెలలు నుంచి పెన్నానదికి సుమారు 30 టీఎంసీల వరకు నీరు విడుదల చేసినట్లు డీఈ రాఘవేంద్ర తెలిపారు. దక్షిణ, ఉత్తర కాలువకు దాదాపు 7 టీఎంసీల నీరు విడుదల చేశామన్నారు. ప్రస్తుతం డ్యాంలో 4.8 టీఎంసీ నీరు ఉన్నట్లు తెలిపారు. నేటికి హెచ్చెల్సీ ద్వారా నీరు పారుతునే ఉంది. దీంతో కాలువకు సమీపంలోని దాదాపు 100 ఎకరాలకు పైగా తోటల్లోకి నీరు ఉబికివస్తోంది. దీంతో అధికంగా సాగు చేసిన చీనీ పంట పూర్తిగా దెబ్బతింటోంది. పంట పోతే మరో ఏడాది పండుతుందిలే అనుకోవచ్చు. కానీ ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన చెట్లు చచ్చిపోతే మాపరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉన్నా అధికారులుగానీ పాలకులుగానీ కన్నెత్తి చూడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆత్మకూరు మండలంలో...

రైతులు దీర్ఘకాలిక పం టల ద్వారా ఆర్థికంగా ప్ర యోజనం పొందవచ్చని రూ. లక్షలు ఖర్చు చేసి సాగుచేసిన పండ్ల తోట లు ఊటనీటితో నాశనమవుతున్నాయి. ఆత్మకూరు మండలంలో 20మంది రైతుల పొలాల్లో నీరు ఉబికి వచ్చి నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే అనధికారికంగా వంద హెక్టార్లలో చీనీ, మామిడి, దానిమ్మ, మొక్కలు చనిపోతున్నాయని తెలిపారు. మండలంలోని ఆత్మకూరు, తలుపూరు, తోపుదుర్తి, పి యాలేరు,పి సిద్దరాంపురం, పి కొత్తపల్లి తదితర గ్రామాల్లో అధికంగా పండ్లతోటలు సాగుచేస్తున్నారు. గ్రామల్లో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాలు నీటితో నిండి వాటిద్వారా నీరు అధికంగా పారడంతో ఊటనీరు తగ్గకుండా వంకల వెంబడి పారుతోంది. సమీప పొలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. చెట్లను రక్షించుకోవడానికి మధ్యలో కాలువ తవ్వినా నీరు వస్తూనే ఉందని రైతులు చెబుతున్నారు. అధికారులు వచ్చి ఫొటోలు తీసుకొని వెళ్లారేగాని ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదని రైతులు పేర్కొన్నారు.

Updated Date - 2022-11-30T23:52:21+05:30 IST

Read more