‘వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం’

ABN , First Publish Date - 2022-04-24T06:35:37+05:30 IST

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో బీసీ లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని టీడీపీ బీసీ సెల్‌ మండల అధ్య క్షుడు జంగం నరసింహులు విమర్శించారు.

‘వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం’
విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ బీసీసెల్‌ మండల నాయకులుధర్మవరంరూరల్‌, ఏప్రిల్‌23: ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో బీసీ లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని టీడీపీ  బీసీ సెల్‌ మండల అధ్య క్షుడు జంగం నరసింహులు విమర్శించారు. టీడీపీ స్థానిక కార్యాలయం లో శనివారం బీసీసెల్‌ మండలనాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టీడీపీ హయాంలో బీసీలో ఉన్న అన్ని కూలాలకు ఆదరణ పథకం ద్వారా ఉపాధిఅవకాశాలు కల్పించా రని, కార్పొరేషన ద్వారా ఆర్థికంగా వెన్నుద న్నుగా నిలిలిచారన్నారు. అలాగే గ్రామాల్లోని బీసీకాలనీల్లో మౌలికసదు పాయాలు కల్పించార న్నారు. నిరుపేద పెళ్లికానుక పథకంతో ఆర్థికసాయం అందించి బీసీ కుటుంబాలను ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు వరకు బీసీలకు సముచిత స్థానం కల్పిస్తూ రాజకీయ, ఆర్థిక చైతన్యంకల్పించిన ఏకైక పార్టీ దేశంలోనే టీడీపీనే అని గుర్తుచేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో... బీసీలకు కేటాయించిన కార్పోరేషన నిధులను సైతం పక్కదారి పట్టించి తీవ్ర అన్యాయం చేశారన్నారు. బీసీలకు కార్పొరేషన పదవులంటూ ఇచ్చి నిధులు లేకుండా వారిని ఉత్సవవిగ్రహాల్లా మార్చారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండలకమిటీ నాయకులు గొట్లూరుశ్రీరాములు, మల్లేనిపల్లి చంద్ర, గరుడంపల్లి చండ్రాయుడు, క్రిష్ట, లక్ష్మీనారాయణ, అంజి, ఏకిల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. Read more