మాస్టర్‌ ప్లాన మేరకు రోడ్డును నిర్మించేలా చూడండి

ABN , First Publish Date - 2022-01-04T05:28:40+05:30 IST

జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిని మాస్ట ర్‌ ప్లాన ప్రకారం నిర్మించేలా చూడాలని కేంద్రమంత్రి నితిన గడ్కరికి లేఖ రాసినట్టు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి సోమవారం వెల్లడిం చారు.

మాస్టర్‌ ప్లాన మేరకు  రోడ్డును నిర్మించేలా చూడండి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి

కేంద్రమంత్రి గడ్కరికి ప్రభాకరచౌదరి లేఖ

అనంతపురం వైద్యం, జనవరి3: జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిని మాస్ట ర్‌ ప్లాన ప్రకారం నిర్మించేలా చూడాలని కేంద్రమంత్రి నితిన గడ్కరికి లేఖ రాసినట్టు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి సోమవారం వెల్లడిం చారు. మాస్టర్‌ ప్లాన డిజైన ప్రకారం అనంతపురం సుభాష్‌ రోడ్‌ నుంచి ఎస్‌కే యూనివర్సిటీ వరకు రోడ్డు నిర్మాణం  చేపట్టడం లేదని అందులో పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో కాంట్రాక్టర్లు డిజైన మేరకు చేయకుండా నిర్మా ణాలకు శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. దీని వల్ల ఈ రహదారి లక్ష్యం నెరవేరకుండా పోతుందని తెలిపారు. దీనిపై స్పందించి గతంలో అప్రూవల్‌ చేసిన మేరకు ఈ రోడ్డును నిర్మించేలా తగిన చర్యలు తీసుకోవాలని లేఖ రాసినట్టు తెలిపారు. 


Read more