గ్రాట్యుటీ కోసం సత్యసాయి కార్మికుల నిరసన

ABN , First Publish Date - 2022-11-08T01:15:56+05:30 IST

ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమకు రావాల్సిన గ్రాట్యుటీ చెల్లించాలంటూ సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు నిరసన చేపట్టారు. సోమవారం సీఐటీయూ నాయకులు, కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు ఓబులు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న స్పందనకు వచ్చారు.

గ్రాట్యుటీ కోసం సత్యసాయి కార్మికుల నిరసన
కలెక్టరేట్‌లో బైఠాయించి నిరసన తెలుపుతున్న ఓబులు, కార్మికులు

అనంతపురం టౌన, నవంబరు7: ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమకు రావాల్సిన గ్రాట్యుటీ చెల్లించాలంటూ సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు నిరసన చేపట్టారు. సోమవారం సీఐటీయూ నాయకులు, కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు ఓబులు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న స్పందనకు వచ్చారు. తొలుత జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. గ్రాట్యుటీ చెల్లించకుండా ఎల్‌ అండ్‌టీ సంస్థ బాధ్యతలు నుంచి తప్పుకుందని మేము అడిగితే ప్రభుత్వం మాకు రూ.30కోట్లకు పైగా బిల్లులు ఇవ్వాలని, మీ గ్రాట్యుటీ పట్టుకొని ఇస్తే చాలని చెబుతున్నారని కలెక్టర్‌కు తెలిపారు. న్యాయం చేయాలని సమ్మెలో ఉన్నామని వివరించారు. అయినా దీనిపై అధికారుల నుంచి పూర్తి హామీ రాలేదు. దీంతో కలెక్టరేట్‌ ఆవరణలో బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో నిరసన విరమించారు.

Updated Date - 2022-11-08T01:15:56+05:30 IST

Read more