-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Sarpanches should work to strengthen TDP-NGTS-AndhraPradesh
-
‘టీడీపీ బలోపేతానికి సర్పంచులు కృషి చేయాలి’
ABN , First Publish Date - 2022-02-19T06:01:19+05:30 IST
టీడీపీ మద్దతు సర్పంచులు పార్టీ బలో పేతానికి సమష్టిగా పనిచేయాలని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు సూచించినట్లు నియోజకవర్గంలోని టీడీపీ మద్దతు సర్పంచులు తెలిపారు.

మడకశిర టౌన /అగళి, ఫిబ్రవరి 18: టీడీపీ మద్దతు సర్పంచులు పార్టీ బలో పేతానికి సమష్టిగా పనిచేయాలని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు సూచించినట్లు నియోజకవర్గంలోని టీడీపీ మద్దతు సర్పంచులు తెలిపారు. మంగళ గిరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సర్పంచుల శిక్షణ తరగతులకు మడకశిర, అగళి మండలాలకు చెందిన టీడీపీ మద్దతు సర్పంచులు హాజరయ్యారు. ఈసందర్భంగా నియోజకవర్గ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీ సుకువెళ్లారు. వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఈసందర్భంగా చం ద్రబాబు స్పందిస్తూ, అధైర్యపడవద్దని పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు సర్పంచులు పేర్కొన్నారు. భవిష్యత తెలుగుదేశం పార్టీదేనని, పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని చంద్రబాబు పలు సూచనలు చేసినట్లు సర్పంచులు తె లిపారు. కార్యక్రమంలో సర్పంచులు నరేంద్రకుమార్, చంద్రప్ప, నాగరాజు, లోకేష్, నరసింహమూర్తి, లింగరాజు, లక్ష్మమ్మ లింగరాజు, నరసింహమూర్తి, ధనుంజయ, లోకేష్, నారాయణప్ప, నరేంద్రకుమార్, కరియన్న, చంద్రప్ప, నాగరాజు, రామాంజనేయులు, ప్రభాకర్ పాల్గొన్నారు.