ప్రతిపక్ష నాయకులపై రివర్స్‌ కేసులా..?

ABN , First Publish Date - 2022-10-05T05:07:28+05:30 IST

నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నిరంకుశ పాలనలో ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యబద్దంగా రాజకీయ కార్య క్రమాలు నిర్వహించుకునే స్వేచ్ఛ లేకుండా పోయిం దని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు.

ప్రతిపక్ష నాయకులపై రివర్స్‌ కేసులా..?

మాజీ మంత్రి కాలవ ధ్వజం

బొమ్మనహాళ్‌, అక్టోబరు 4: నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నిరంకుశ పాలనలో ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యబద్దంగా రాజకీయ కార్య క్రమాలు నిర్వహించుకునే స్వేచ్ఛ లేకుండా పోయిం దని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ నాయకులను కూడా వారి కార్యక్రమాలు నిర్వహించకుండా అడ్డుకోవడం దుర్మా ర్గమని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. బొమ్మనహాళ్‌ మండల దేవగిరి గ్రామంలో రెండు రోజుల క్రితం బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారం చేస్తుంటే వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని వారిపై దౌర్జన్యానికి దిగడం ఏమిటని ప్రశ్నించారు. తమపై జరిగిన దాడి ఘట నపై బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వైసీపీ గూండాలను వదిలేసి ఫిర్యాదుదారులపైనే ఎదురు కేసు పెట్టడం పోలీసుల పక్షపాత ధోరణికు అద్దం పడుతుందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా దేవగిరి గ్రామానికి వెళ్లారని బీజేపీ నాయ కులపై కేసు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి ఒత్తిడి తోనే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నా రన్నా రు. ఒక వైపు గడపగడపకు కార్యక్రమంలో తెలుగు దేశం నాయకులపై తప్పుడు కేసులు పెట్టిస్తూ మరోవైపు బీజేపీ వారిని కూడా నియోజ కవర్గంలో తిరగరాదన్న విధంగా పోలీసులను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే వేధిస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసుల ను అడ్డు పెట్టుకుని ఎమ్మె ల్యే ఎంతకాలం ప్రతిపక్షాలను నిలువరిస్తాడో మేము చూస్తామన్నారు. మూడున్నరేళ్ల కాలంలో నియోజ కవర్గ అభివృద్ధిపై ఏ మాత్రం కనీస శ్రద్ధ చూపని కాపు రామచం ద్రారెడ్డి ప్రతిపక్షాలపై అక్కసు వెళ్లగక్కడంలో మాత్రం ముందుంటాడన్నారు. అరా చకాలకు వ్యతి రేకంగా చేసే పోరాటంలో ప్రజాస్వామికవాదులం దరూ కలిసి రావాలని కాలవ  పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వ అరాచకాలపై  ప్రజలు తిరగ బడే రోజులు దగ్గరలోనే వున్నాయని తెలిపారు. 


Read more