తిరుపతి-హుబ్లీ ప్యాసింజరు పునరుద్ధరణ

ABN , First Publish Date - 2022-10-14T05:42:20+05:30 IST

హుబ్లీ-తిరుపతి-హుబ్లీ ప్యాసింజరు రైళ్లను ఈ నెల 17వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

తిరుపతి-హుబ్లీ ప్యాసింజరు పునరుద్ధరణ


గుంతకల్లు, అక్టోబరు 13:   హుబ్లీ-తిరుపతి-హుబ్లీ ప్యాసింజరు రైళ్లను ఈ నెల 17వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.  07657 నెంబరు రైలు ఈనెల 17వ తేదీన తిరుపతిలో ఉదయం 6-10 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 1-10 గంటలకు గుంతకల్లుకు వచ్చి, రాత్రి 9-10 గంటలకు హుబ్లీకి చేరుకుంటుందని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం. 07668) ఈ నెల 18వ తేఈన హుబ్లీలో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12-55 గంటలకు గుంతకల్లుకు వచ్చి, రాత్రి 9-50 గంటలకు తిరుపతికి చేరుతుందన్నారు. 

Read more