ఎంపీఆర్‌కు తగ్గిన ఇనఫ్లో

ABN , First Publish Date - 2022-09-10T05:40:32+05:30 IST

ఎంపీఆర్‌ డ్యాంకు ఇనఫ్లో తగ్గింది. ఎగువ ప్రాంతాల్లో గురు, శుక్రవారం వర్షాలు పడకపోవడంతో పేరూరు, పీఏబీఆర్‌ డ్యాంల నుంచి 14వేల క్యూసెక్కుల ఇనఫ్లో, 17వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉంది.

ఎంపీఆర్‌కు తగ్గిన ఇనఫ్లో
ఎంపీఆర్‌ గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

 గార్లదిన్నె, సెప్టెంబరు 9:  ఎంపీఆర్‌ డ్యాంకు ఇనఫ్లో తగ్గింది. ఎగువ ప్రాంతాల్లో గురు, శుక్రవారం వర్షాలు పడకపోవడంతో పేరూరు, పీఏబీఆర్‌ డ్యాంల నుంచి  14వేల క్యూసెక్కుల ఇనఫ్లో, 17వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో  ఉంది.  ప్రస్తుతం ఎంపీఆర్‌ డ్యాంలో 4.7 టీఎంసీ నీరు ఉన్నట్లు డీఈ రాఘవేంద్రరావు తెలిపారు.  గత వారంరోజుల నుంచి ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు పేరూరు, పీఏబీఆర్‌ డ్యాంల నుంచి ఎంపీఆర్‌ డ్యాంలోకి సుమారు 25వేల క్యూసెక్కులు ఇనఫ్లో ఉండేది. దీంతో డ్యాం 10 గేట్లు ఎత్తి పెన్నాలోకి దాదాపు 24వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. దీంతో  పెన్నానది సమీపంలో ఉన్న పెనకచెర్ల కొత్తపల్లి, కొప్పల కొండ, కేశవాపురం, ముంటిమడుగు, ఇల్లూరు, కల్లూరు తదితర గ్రామాల్లో రైతులు సాగుచేసిన వరి పంటలు పూర్తిగా మునిగిపోయిన విషయం తెలిసిందే.

Read more