అలరించిన నృత్యరూపకం

ABN , First Publish Date - 2022-12-12T00:13:46+05:30 IST

స్థానిక సాయికుల్వంత సభామండపంలో ఆదివారం సాయంత్రం బాలవికాస్‌ విద్యార్థులు, యువత ప్రదర్శించిన సాయియుగం.. స్వర్ణయుగం నృత్యరూపకం భక్తులను అలరింపజేసింది.

అలరించిన నృత్యరూపకం
నృత్యం చేస్తున్న బాలవికాస్‌ విద్యార్థులు

పుట్టపర్తి, డిసెంబరు 11: స్థానిక సాయికుల్వంత సభామండపంలో ఆదివారం సాయంత్రం బాలవికాస్‌ విద్యార్థులు, యువత ప్రదర్శించిన సాయియుగం.. స్వర్ణయుగం నృత్యరూపకం భక్తులను అలరింపజేసింది. శ్రీకాకుళం జిల్లా భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. మొదట ఆ జిల్లాలో చేపట్టిన సేవాకార్యక్రమాలను శ్రీసత్యసాయి సేవాసంస్థల శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు వివరించారు. సత్యసాయి చూపిన బాటలో పయనిస్తూ కొవిడ్‌ కష్టకాలంలో వేలాదిమంది పేదలకు నారాయణసేవ అందించామన్నారు. హాస్పిటళ్లలో నిత్యం రోగులకు నారాయణసేవ చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా ఇంటింటికీ సాయిసేవలు, సాయిబోధనలను తీసుకెళ్తున్నామన్నారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఏటా పర్తియాత్ర పేరుతో మూడువేల మంది భక్తులు పుట్టపర్తికి రావడం ఆనవాయితీ.

Updated Date - 2022-12-12T00:13:49+05:30 IST