భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: టీఎనటీయూసీ

ABN , First Publish Date - 2022-09-30T05:46:07+05:30 IST

భవననిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టీఎనటీయూసీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు తాడల నాగభూషణం డిమాండ్‌ చేశారు.

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: టీఎనటీయూసీ
కార్మికశాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

అనంతపురం కల్చరల్‌, సెప్టెంబరు 29: భవననిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టీఎనటీయూసీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు తాడల నాగభూషణం డిమాండ్‌ చేశారు. గురువారం టీఏఎనటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కార్మికశాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగభూష ణం మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక భవన నిర్మాణరంగ కార్మికుల సమస్యలు రెట్టింపయ్యాయన్నారు. ఇసుకలేక, పనిలేక ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారన్నారు. కొందరు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయన్నారు. సంక్షేమబోర్డు ద్వారా వచ్చే పథకాలను నిలిపివేస్తూ రాష్ట్రప్రభుత్వం 1214 సర్క్యులర్‌ జారీ చేసి కార్మికుల పొట్ట కొట్టిందన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏఎల్‌ఓ రమాదేవికి అందజేశారు. కార్యక్రమంలో అనంతపురం రూరల్‌ మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్‌ మండల ప్రధాన కార్యదర్శి రఘు, తెలుగు రైతు విభాగం రాప్తాడు అధ్యక్షుడు నారాయణస్వామి, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి లక్ష్మిదేవి, రాష్ట్ర కురుబ సంఘం డైరెక్టర్‌ మురళి, నాయకులు పూజారప్ప, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more