ఆశాకార్యకర్తల ముందస్తు అరెస్టు

ABN , First Publish Date - 2022-02-23T06:02:07+05:30 IST

అనంతపురంలోని కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్తున్న మండలంలోని ఆశాకార్యకర్తలను పోలీసులు మంగళవారం ఎక్కడి క్కడ అడ్డుకున్నారు.

ఆశాకార్యకర్తల ముందస్తు అరెస్టు
ముదిగుబ్బ పోలీస్‌స్టేషనలో నిరసన తెలుపుతున్న ఆశాకార్యకర్తలు


ముదిగుబ్బ, ఫిబ్రవరి 22: అనంతపురంలోని కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్తున్న మండలంలోని ఆశాకార్యకర్తలను పోలీసులు మంగళవారం ఎక్కడి క్కడ అడ్డుకున్నారు. అరెస్టు చేసి పోలీస్‌స్టేషనకు తరలించారు. ఈ సంద ర్భంగా ఆశాకార్యకర్తలు మాట్లాడుతూ....తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా తలపెట్టిన కలెక్టరేట్‌ ముట్టడిని ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకోవడం తగదన్నారు. న్యాయమైన సమస్యలపై పోరాడే హక్కు కూడా మాకు లేదా అని ప్రశ్నించారు. అనంతరం సీఐటీయూ మండల కార్యదర్శి ఆటోపెద్దన్న, ఆశాకార్యకర్తలు జమీనా, చంద్రకళ, రామకృష్ణమ్మ, అనురాధ, శారద, సుమతి, జయలక్ష్మి, గాయుత్రి పోలీస్‌స్టేషనలోనే నిరసన తెలిపారు. 

బత్తలపల్లి: అనంతపురంలోని కలెక్టరేట్‌ ముట్టడికి ఆశావర్కర్లు వెళుతున్నారన్న సమాచారంతో ఎస్‌ఐ శ్రీహర్ష మంగళవారం మండలకేం ద్రంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా బస్సులు, ప్రైవే టు వాహనాలు తనిఖీ చేశారు. ఎవరైనా ఆశావర్కర్లు కలెక్టరేట్‌ ముట్టడికి వెళుతుంటే వెనక్కి వెళ్లాలని సూచించారు. ఎవరూ లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. 


Read more