ప్రాణాలు హరిస్తున్న విద్యుత తీగలు

ABN , First Publish Date - 2022-11-02T23:59:00+05:30 IST

విద్యుత తీగలు ప్రజల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. ఫలితంగా మనుషులే కాదు మూగజీవాలు సైతం బలవుతున్నాయి. ప్రమాదాల బారిన కుటుంబాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా..విద్యుత శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యపు నిద్ర మత్తు వీడటం లేదు.

 ప్రాణాలు హరిస్తున్న విద్యుత తీగలు
దర్గాహోన్నూరు విద్యుత ప్రమాదంలో మృతులు

ప్రమాదాల నియంత్రణలో విద్యుత శాఖ మీనమేషాలు

ఉమ్మడి జిల్లాలో ఏటా పెరుగుతున్న విద్యుత ప్రమాదాలు

మృతుల్లో ఎక్కువశాతం అన్నదాతలే

ఐదేళ్లలో 350మందికిపైగా మృత్యువాత

అనంతపురం రూరల్‌ :

విద్యుత తీగలు ప్రజల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. ఫలితంగా మనుషులే కాదు మూగజీవాలు సైతం బలవుతున్నాయి. ప్రమాదాల బారిన కుటుంబాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా..విద్యుత శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యపు నిద్ర మత్తు వీడటం లేదు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారే తప్ప చర్యలు తీసుకోవడంతో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో అమాయక ప్రజల ప్రాణాలు కరెంటు కాటుకు బలవుతున్నాయి. నాలుగు నెలల కిందట శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి ఘటన నేటికీ కళ్లముందే కనిపిస్తోంది. అది మరవక ముందే బుధవారం బొమ్మనహాల్‌ మండలం దర్గాహోన్నూరులో జరిగిన ప్రమాదంలో మరో నలుగురు మృతి చెందారు. ఉమ్మడి జిల్లాలో 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 384మంది విద్యుత ప్రమాదాల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో 100మందికిపైగా గాయపడినట్లు ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది.

అన్నదాతలే అధికం..

విద్యుత ప్రమాదాల్లో ఎక్కువశాతం అన్నదాతలు, రైతు కూలీలే మృతి చెందుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లి విద్యుదాఘాతానికి బలైపోతున్నారు. సాధారణంగా ఏవైనా విద్యుత మరమ్మతుల పనులు చేయాలంటే స్థానిక లైనమెన్లు చేయాలి. ఫ్యూజులు పోయినా..విద్యుత వైర్లు తెగిపోయినా.. క్షేత్రస్థాయిలోని లైనమెన్లకు సమాచారం వెళుతోంది. అయితే వారి నుంచి స్పందన కరువవుతోంది. విద్యుత సిబ్బంది కోసం ఎదురుచూడలేక రైతులే స్థానిక లైనమన ద్వారా ఎల్‌సీ తీసుకోవడం..లేదా ఆ ప్రాంతానికి విద్యుత సరఫరా బంద్‌ చేయించడం వంటివి చేస్తూ అనుకోని రీతిలో ప్రమాదాలకు బలైపోతున్నారు. సాధారణంగా అయితే ఎల్‌సీ ఇచ్చిన లైనమెన వచ్చి పనులు చేయాల్సి ఉంది. అయితే ఆ పరిస్థితి ఎక్కడ కనిపించకపోవడం గమనార్హం.

కూలికెళితేనే కుటుంబం గడిచేది

బొమ్మనహాళ్‌, నవంబరు 2: మండలంలోని దర్గాహోన్నూరు గ్రామ సమీపంలో జరిగిన విద్యుత ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందారు. దీంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. ఒకే ఇంట్లో అత్త వన్నక్క (52), ఆమె కోడలు రత్నమ్మ(40) విద్యుతఘాతానికి బలైపోయారు. రత్నమ్మ పిల్లలు నిఖిల్‌, గోవింద, సంగీత, పూజ నలుగురు తల్లిని, నాన్నమ్మని పోగొట్టుకుని అనాథలుగా మిగిలారు. మరో కూలీ పార్వతి (40) కూలి పనులకు పోతూ కుటుంబాన్ని పోషించేది. ఆమె కూలీ పనులకు వెళితే గానీ పూటగడవలేని పరిస్థితి. ఈమెకు ఇద్దరు సంతానం సోమశేఖర్‌, సాంకేతరుద్ర ఉన్నారు. సాంకేతరుద్ర ఒకటో తరగతి చదువుతుండగా కుటుంబ పోషణ భారమవుతుందని పదోతరగతి చదువుతున్న సోమశేఖర్‌ను బడిమాన్పించి కూలిపనులకు పంపుతుండేది. ఈమె మృతితో భర్త మురిడప్ప, ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. పూటగడవక రూ. 200 రోజు కూలి కోసం పనులకు వెళ్లి విద్యుతఘాతానికి శంకరమ్మ (34) బలైంది. ఈమెకు కుమారుడు వన్నూరుస్వామి, కూతురు మినికమ్మ ఉన్నారు. కుమార్తెకు ఇటీవలే వివాహం చేసింది. భర్త రామకృష్ణ, కుమారుడు వన్నూరుస్వామి అనాథలయ్యారు. కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీర్చాలని సుంకమ్మ కూలి పనులకు వెళ్తూ తీవ్రంగా గాయపడింది. ఈమెకు వనజాక్షి, వసంత, ఈశ్వర్‌, శిరీష సంతానం. వసంత మానసిక స్థితి బాగోలేక ఇంట్లోనే ఉంటోంది. వనజాక్షికి ఇటీవలే వివాహం చేసింది. ఈమె విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

యంత్రాంగం విఫలం: సీపీఎం

అనంతపురం కల్చరల్‌: విద్యుత ప్రమాదాల నివారణలో యంత్రాంగం విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు. బొమ్మనహాళ్‌ మండలం దర్గాహొన్నూరు వద్ద జరిగిన విద్యుత ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మరణించడం, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటం తీవ్ర దిగ్ర్భాంతికరమన్నారు. గతంలో తాడిమర్రి మండలంలో ఇలాంటి సంఘటనే జరిగిందని, అది మరవకముందే ఇపుడు దర్గాహొన్నూరు ఘటన విద్యుతశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందన్నారు. సంఘటనపై సమగ్రంగా విచారణ జరిపి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదంలో మరణించిన కూలీల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.25లక్షలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ తప్పిదమే: మాజీ మంత్రి కాలవ

విద్యుత అధికారుల నిర్లక్ష్యం కారణంగా సంభవించిన దర్గాహోన్నూరు ప్రమాద ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు, తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండాపురం కేశవరెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై వారు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. దినసరి కూలీలైన మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని కోరారు. సమగ్ర విచారణ జరిపికారకులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.

ప్రమాదస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

విద్యుత ప్రమాద సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెంటనే వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాసిరకమైన విద్యుత వైర్లు వినియోగించడంతో తీగలు తెగిపోయినట్లు ఆయన ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం.

పలువురు అధికారుల సస్పెన్షన

ఘటనపై విచారణ .. రూ. 5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా.. ఏపీఎ్‌సపీడీసీఎల్‌ సీఎండీ సంతోష్‌ రావు

ప్రాథమిక సమాచారం ఆధారంగా విద్యుత ప్రమాద ఘటనకు బాధ్యులను చేస్తూ పలువురు ఉద్యోగులను సస్పెండ్‌ చేసినట్లు ఏపీఎ్‌సపీడీసీఎల్‌ సీఎండీ సంతో్‌షరావు ఓ ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఏపీఎ్‌సపీడీసీఎల్‌ కార్పొరేటర్‌ కార్యాలయం నుంచి చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ డీవీ చలపతి నేతృత్వంలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ కె గురవయ్య, అనంతపురం విజిలెన్స ఇనస్పెక్టర్‌ విజయభాస్కర్‌రెడ్డిలతో కమిటీని నియమించినట్లు తెలిపారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కళ్యాణదుర్గం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ మల్లికార్జునరావు, బొమ్మనహాళ్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎంకే లక్ష్మీరెడ్డి, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ప్రొటెక్షన హెచ హమీదుల్లా బేగ్‌, దర్గాహోన్నూరు లైనమన బసవరాజులను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశామన్నారు. అనంతపురం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ నాగరాజు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఆపరేషన రాయదుర్గం శేషాద్రి శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ అనంతపురం కె రమే్‌షల నుంచి వివరణ కోరుతూ ఆదేశాలు జారీ చేశామన్నారు.

రూ. పది లక్షల ఎక్స్‌గ్రేషియా

ప్రమాద మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి రూ. పది లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. విద్యుత ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడంతోపాటు మృతుల కుటుంబాలందరినీ ఆదుకుంటామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-11-02T23:59:09+05:30 IST