అర్ధరాత్రి ప్రయాణికుల అవస్థలు

ABN , First Publish Date - 2022-12-10T00:03:37+05:30 IST

సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చిన రైలు ప్రయాణికులు సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.

అర్ధరాత్రి ప్రయాణికుల అవస్థలు

ప్రైవేట్‌ వాహనాలే శరణ్యం

పుట్టపర్తిరూరల్‌, డిసెంబరు 9 : సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చిన రైలు ప్రయాణికులు సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ప్రతివారం గురువారం పశ్చిమబెంగాల్‌ హౌరా నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్‌ రాత్రి పది గంటలకు పుట్టపర్తి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన చేరుకుం టుంది. ఈ రైలులో దాదాపు 1500వందల నుంచి రెండువేల మంది వరకు ప్రయాణికులు పుట్టపర్తికి వస్తుంటారు. ఐతే రాత్రి సమయంలో పుట్టపర్తికి కానీ, సత్యసాయి సూపర్‌ హాస్పిటల్‌కుకానీ ఎటువంటి బస్సు సౌకర్యంలేక పోవడంతో వారికి ప్రవేట్‌ వాహనాలే దిక్కవుతున్నాయి. రాత్రి సమయం కావడం బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రవేట్‌వాహనాల యాజమానులు చెలరేగిపోయి అందనకాడికి ప్రయాణికులను దోచుకుంటున్నారు. తమ ఇష్టం వచ్చినట్లు ఒక్కో ప్రయాణికుడి నుండి రూ. వంద నుంచి రూ. 200 దాకా వ సూలుచేస్తున్నారు. అసలే ఇక్కడికి వచ్చేవారు ఎక్కువ మంది ప్రయాణికులు అస్పత్రికి వచ్చే పేదవారు. ఇంతంత డబ్బులు చెల్లించలేక తీవ్ర అవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీసీ వారు స్పందించి బస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు ప్రయాణికులు కోరుచున్నారు.

ఈ విషయంపై ఆర్టీసీ ప్రజారవాణాధికారి మదుసూదన ను అడుగగా... ప్రతిగురువారం హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు ద్వారా ప్రయాణికులు పుట్టపర్తి అస్ప త్రికి వస్తున్నట్టు మాదృష్టికి వచ్చిందని తెలిపారు. రైల్వే అధికారులతో చర్చించి రద్దీని బట్టి బస్సులు ఏర్పాటు చేస్తామని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు.

Updated Date - 2022-12-10T00:03:41+05:30 IST