రైల్లో నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు

ABN , First Publish Date - 2022-09-12T04:48:28+05:30 IST

పట్టణంలోని గాంధీనగర్‌లో ఆదివారం రైల్లో నుంచి ప్రమా ద వశాత్తు జారిపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

రైల్లో నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు
గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న బ్లూకోల్ట్స్‌ పోలీసులుధర్మవరం, సెప్టెంబరు 11: పట్టణంలోని గాంధీనగర్‌లో ఆదివారం రైల్లో నుంచి ప్రమా ద వశాత్తు జారిపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అర్బన పోలీసు లు తెలిపిన మేరకు... బెంగ ళూరు నుంచి ధఽర్మవరం వైపు వస్తున్న రైల్లో నుంచి గాఽంధీ నగర్‌ అండర్‌ బ్రిడ్జి వద్దకు రాగానే  ఓ గుర్తుతెలియని వ్య క్తి ప్రమాదవశాత్తు జారికింద పడ్డాడు.  గమనించిన స్థానికు లు అర్బన సీఐ సుబ్రహ్మణ్యంకు ఫోనలో సమాచారం అందించారు. వెంటనే సీఐ బ్లూకోల్ట్స్‌ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపారు. వారు గాయపడిన వ్యక్త్తిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గాయపడిన వ్యక్తి కర్ణాటక వాసి అయి ఉంటాడని భావిస్తున్నారు.


Read more