రేపటి నుంచి పది పరీక్ష ఫీజు చెల్లించండి

ABN , First Publish Date - 2022-11-24T00:19:29+05:30 IST

పదో తరగతి విద్యార్థులు 2023 ఏడాది మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో జరిగే పబ్లిక్‌ పరీక్షలకు ఈ నెల 25వ తేదీ నుంచి ఫీజు చెల్లించాలని డీఈఓ వెంకటక్రిష్ణారెడ్డి, ఏసీ గోవింద్‌నాయక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రేపటి నుంచి పది పరీక్ష ఫీజు చెల్లించండి

అనంతపురం విద్య, నవంబరు 23: పదో తరగతి విద్యార్థులు 2023 ఏడాది మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో జరిగే పబ్లిక్‌ పరీక్షలకు ఈ నెల 25వ తేదీ నుంచి ఫీజు చెల్లించాలని డీఈఓ వెంకటక్రిష్ణారెడ్డి, ఏసీ గోవింద్‌నాయక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 10 తేదీ వరకూ వరకూ రూ.125 ఫీజు చెల్లించాలన్నారు. రూ.50ల అపరాధ రుసుంతో డిసెంబరు 11నుంచి 20వ తేదీ వరకూ, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబరు 21 నుంచి 25 వరకూ, రూ.500 అపరాధ రుసుంతో వచ్చే నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు 2017 నుంచి 2019 మధ్య పరీక్షలు తప్పిన విద్యార్థులు కూడా ఫీజు చెల్లించాలన్నారు. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు తప్పిన విద్యార్థులు రూ. 125, అంతకంటే తక్కువ సబ్జెక్టులున్న విద్యార్థులు రూ. 110, ఒకేషనల్‌ విద్యార్థులు, రెగ్యులర్‌ ఫీజుతోపాటు అదనంగా రూ. 60 చెల్లించాలని సూచించారు.

Updated Date - 2022-11-24T00:19:32+05:30 IST