పరిటాల శ్రీరామ్‌ పరామర్శ

ABN , First Publish Date - 2022-10-01T05:06:42+05:30 IST

మండలంలోని రామాపురంలో ఇటీవల మృతి చెందిన మల్లేష్‌ కుటుంబాన్ని టీడీపీ ధర్మవరం ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ పరామర్శించారు.

పరిటాల శ్రీరామ్‌ పరామర్శ
కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌

బత్తలపల్లి, సెప్టెంబరు30: మండలంలోని రామాపురంలో ఇటీవల మృతి చెందిన మల్లేష్‌ కుటుంబాన్ని టీడీపీ ధర్మవరం ఇనచార్జ్‌  పరిటాల శ్రీరామ్‌ పరామర్శించారు. మల్లేష్‌ చిత్రపటానికి పరిటాల శ్రీరామ్‌ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయ న వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా రామాపురంలో గ్రామంలో వెలసిన నూతనంగా నిర్మించిన షీర్డిసాయిబాబా దేవాలయాన్ని పరిటాలశ్రీరామ్‌ సందర్శించారు. శ్రీరామ్‌ వెంట మండల కన్వీనర్‌ నారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

పుట్టపర్తిరూరల్‌, సెప్టెంబరు 30: తల్లీబిడ్డల ఆరోగ్యంపై  ఐసీడీఎస్‌ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్‌ బసంత కుమార్‌ సూచించారు. శుక్రవారం ఎనుమలపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సీడీపీఓ శాంతాకుమారి, ఐసీడీఎస్‌ సూపర్వైజర్‌ అరుణ, డాక్టర్‌ నాగరాజ్‌నాయక్‌, మహేష్‌, కాంతమ్మ, పరిమిళ తదితరులు పాల్గొన్నారు.

అంగనవాడీ  కేంద్రంలో సూచనలిస్తున్న కలెక్టర్‌

Read more