‘వృత్తి ధర్మాన్ని పాటించండి’

ABN , First Publish Date - 2022-09-25T05:20:23+05:30 IST

పోలీసుశాఖలో ప్రజలకు ఎక్కువ సేవచేసే అవకాశం హోంగార్డులకే దక్కుతుందని, అలాంటి వారు తమ వృత్తి ధర్మాన్ని కచ్చితంగా పాటించాలని సౌత రీజియన హోంగార్డ్‌ కమాండెంట్‌ మహేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

‘వృత్తి ధర్మాన్ని పాటించండి’
హోంగార్డుల గౌరవ వందనం స్వీకరిస్తున్న కమాండెంట్‌

పుట్టపర్తి రూరల్‌, సెప్టెంబరు 24: పోలీసుశాఖలో ప్రజలకు ఎక్కువ సేవచేసే అవకాశం హోంగార్డులకే దక్కుతుందని, అలాంటి వారు తమ వృత్తి ధర్మాన్ని కచ్చితంగా పాటించాలని సౌత రీజియన హోంగార్డ్‌ కమాండెంట్‌ మహేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని సిరిసాని పోలీ్‌సపరేడ్‌ గ్రౌండులో హోంగార్డ్‌ పరేడ్‌ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కమాండెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసుశాఖలో ప్రజలకు ఎక్కువ సేవచేసే అవకాశం హోంగార్డులకే దక్కుతుందన్నారు. తమ ఉద్యోగాన్ని తక్కువ చేసుకోకుండా విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐ శ్రీశైలంరెడ్డి, అడ్మిన టైటాస్‌, వెల్ఫేర్‌ ఆర్‌ఎ్‌సఐ చంద్ర శేఖర్‌, డ్యూటీ ఆర్‌ఎ్‌సఐ సద్దాం హుస్సేన, హోంగార్డు ఆర్‌ఎ్‌సఐ శ్రీరాంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు. Read more