వరదలతో దెబ్బతిన్న పంటల పరిశీలన

ABN , First Publish Date - 2022-09-28T05:27:59+05:30 IST

వేదవతి పరివాహక ప్రాంతాలలో ఇటీవల వరద ఉధృతికి నష్టపోయిన పంటలను రాయదుర్గం ఏడీఏ లక్ష్మానాయక్‌, ఏవో శ్రావణ్‌కుమార్‌ పరిశీలించారు.

వరదలతో దెబ్బతిన్న పంటల పరిశీలన

 కణేకల్లు, సెప్టెంబరు 27: వేదవతి పరివాహక ప్రాంతాలలో ఇటీవల వరద ఉధృతికి నష్టపోయిన పంటలను రాయదుర్గం ఏడీఏ లక్ష్మానాయక్‌, ఏవో శ్రావణ్‌కుమార్‌ పరిశీలించారు. మండలంలోని బ్రహ్మసముద్రం, మీన్లపల్లి గ్రామాల పరిధిలో మంగళవారం వారు పర్యటించారు. బ్రహ్మసముద్రం పరిధిలో వరి దాదాపు 2200 ఎకరా లలో పిలకల దశలోనే వున్న వరిలో 180 ఎకరాలు  ముంపునకు గురై నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అలాగే భారీఎత్తున పంట పొలాల్లోకి ఇసుక చేరుకుని సాగుకు వీలుకాని పరిస్థితి నెలకొందని వారు చెప్పారు. ఇక మీన్లపల్లిలో వంద ఎకరాలు పత్తి పంట వుండ గా అది పూర్తిగా ముంపునకు గురైనట్లు గుర్తించామన్నారు. బాధిత రైతులను విచారించి వారితో వివరాలు తెలుసుకోవడం జరిగిందని వ్యవసాయాధికారులు తెలిపారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు వారు తెలిపారు.

బొమ్మనహాళ్‌లో... వరద ఉధృతికి నష్టపోయిన పంటలను మం గళవారం ఏడీఏ లక్ష్మానాయక్‌, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఏవో అహ్మ ద్‌ బాషా పరిశీలించారు. మండలంలో కళ్లుదేవనహళ్లి, కళ్లుహోళ, హరేసముద్రం తదితర గ్రామాలలో 2200 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు అంచనా వేశామని ఏడీఏ తెలిపారు. ఇందులో వరి 350 ఎకరాలు, వేరుశనగ 750 ఎకరాలు, ప్రత్తి 730 ఎకరాలు, మొక్కజొన్న 220 ఎకరాలు, జొన్న 90 ఎకరాలు, కందులు 40 ఎకరా లలో నష్టం జరిగినట్లు తెలిపారు. పంట నష్టం జరిగిన రైతుల జాబితాను సిద్దం చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు. 

Read more