చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలి: టీడీపీ

ABN , First Publish Date - 2022-04-24T05:53:06+05:30 IST

మాజీ ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వం ఇచ్చిన నో టీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని టీడీపీ రా ష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి డిమాండ్‌ చేశారు.

చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలి: టీడీపీ
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి

మడకశిర టౌన, ఏప్రిల్‌ 23: మాజీ ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వం ఇచ్చిన నో టీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని టీడీపీ రా ష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక బాలాజీనగర్‌లోని ఆయన స్వగృహంలో విలేకరులతో మా ట్లాడారు. బాధితులకు న్యాయం చేయాలని చంద్ర బాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తే నోటీసులు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించా రు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వి కలాంగురాలిపై అత్యాచార ఘటనలో న్యాయం చే యాలని కోరామన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై దౌర్జన్యాలు, అఘాయిత్యాలు పె రిగిపోతున్నాయని, మహిళలకు  రక్షణ లేకపోయిందని వాపోయారు. రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్న వైసీపీ ప్రభుత్వంలో  కదలిక లేకపోవడం శోచనీయమన్నారు. మానవతదృక్పతంతో బాధిత కుటుంబానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.5 లక్షలు ప్రకటిస్తే, అదే సమయంలో అక్కడకు వచ్చిన మహిళా కమిషన చైర్‌పర్సన వాసిరెడ్డిపద్మ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిందన్నారు. బాధితులకు ఎంతమేర న్యా యం చేస్తారో దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు. రా ష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ తగిన మూ ల్యం చెల్లించుకోక తప్పదన్నారు. మాజీ ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడుకు ఇచ్చిన నోటీసులను భే షరతుగా ఉపసంహరించుకోవాలన్నారు. అత్యాచార సంఘటనకు పాల్పడిన వారిని బహిరంగంగా ఉరితీయాలన్నారు. భవిష్యతలో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తు చేశారు.


Updated Date - 2022-04-24T05:53:06+05:30 IST